సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు రేపు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప-2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 23, 2024 9:42 pm
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…