తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే స్మగ్లర్ల కథతో వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప చిత్రంపై విమర్శలు గుప్పించారు. చంకలో బిడ్డ పెట్టుకుని న్యాయం కోసం, హక్కుల కోసం ఓ మహిళ పోరాడిన సినిమాకు అవార్డు లేదని, స్మగ్లర్ పాత్ర ఉన్న సినిమాకు అవార్డు వచ్చిందని విమర్శించారు.
స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలని ప్రశ్నించారు. నేరప్రవృత్తిని పెంచేలా ఉన్న ఇటువంటి సినిమాలు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశముందని, మానవతా దృక్పథం ఉన్న సందేశాత్మక సినిమాలు రావాలని అన్నారు. ఎటువంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో… స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2024 4:28 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…