Political News

కొడుకు పేరు మీద రేవతి కుటుంబానికి కోమటిరెడ్డి ఆర్థికసాయం

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ పెద్దమనసు చాటుకున్నారు. ఆయన తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

కోమటిరెడ్డి కుమారుడు ప్రతీక్ 13 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఇక అతని కుమారుడి పేరు మీద ఆయన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేవతి కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం అంధించి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన కోమటిరెడ్డి, ఈ ఘటనపై సినీ పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించలేదని పేర్కొన్నారు.

ముఖ్యంగా, రేవతి కుటుంబానికి సాయం చేస్తానని మాట ఇచ్చిన అల్లు అర్జున్ తన హామీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. ప్రభుత్వానికి చెందిన పలువురు అధికారులు రేవతి కుటుంబాన్ని పరామర్శించినా, సినీ పరిశ్రమ నుంచి తగిన స్పందన రాలేదని తెలిపారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులన్నింటిని తెలంగాణ ప్రభుత్వం భరించనుందని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఈ వ్యయాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. గాయపడిన చిన్నారికి అత్యుత్తమ చికిత్స అందించేందుకు కిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, థియేటర్లలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.

This post was last modified on December 21, 2024 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే…

3 minutes ago

నో బెనిఫిట్ షోస్, నో టికెట్ హైక్స్ – భవిష్యత్ ఏంటి ?

తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…

48 minutes ago

భగ‌వ‌త్ గారి గీతోప‌దేశం.. మోడీకి మండేలా ఉందే!

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భగ‌వ‌త్‌.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాల‌కు కూడా.. ఐకాన్‌. ఆయ‌న…

1 hour ago

వంగతో ఒక్క ఛాన్స్.. రిషబ్ కోరిక!

‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…

1 hour ago

కోటీ 15 ల‌క్ష‌ల‌ను వ‌డ్డీతో క‌ట్టాల‌ని.. రాం గోపాల్ వ‌ర్మ‌కు నోటీసులు!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాం గోపాల్ వ‌ర్మ‌కు ఏపీ ఫైబ‌ర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 ల‌క్ష‌ల…

2 hours ago

గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ బాంబు!

ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…

2 hours ago