Political News

నిర్మ‌ల‌మ్మ ఎఫెక్ట్‌: ‘పాప్ కార్న్‌’పై ప‌న్ను పేలుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ నేతృత్వంలోని జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. కాల‌క్షేపానికి తినే పాప్‌కార్న్‌పై జీఎస్టీని బాదేశారు. అంతేకాదు.. మూడు ర‌కాలుగా పాప్ కార్న్‌ను విభ‌జించి.. మూడు స్థాయిలో ప‌న్నులు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌స్థాన్‌లోని జై స‌ల్మేర్‌లో శ‌నివారం నిర్వ‌హించిన జీఎస్టీ మండ‌లి స‌మావేశంలో అనేక అంశాల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌పై స్ప‌ష్టత ఇచ్చారు.

ప్ర‌ధానంగా పాప్ కార్న్‌ను మూడు విభాగాలుగా వ‌ర్గీక‌రించి ప‌న్నుల మోత మోగించారు. అదేవిధంగా ధ‌రించే దుస్తుల‌పైనా మూడు రూపాల్లో ప‌న్నులు నిర్ణ‌యించారు. ఇక, పోర్టిఫైడ్ బియ్యం విష‌యంలో ప‌న్నుల‌ను త‌గ్గించడం గ‌మ‌నార్హం. ఇంటి నిర్మాణానికి ఉప‌యోగించే ఫ్లైయాష్ ఇటుక‌ల జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి త‌గ్గించారు. అయితే.. సెకండ్ హ్యాండ్ కార్ల రీసేలింగ్‌పై మాత్రం ప‌న్నులు బాదేశారు. వీటి విక్ర‌యాల‌ను నిరేధించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు మంత్రి పేర్కొన్నారు.

పాప్ కార్న్‌పై బాదుడు ఇలా..

  • రెడీ-టు-ఈట్ పాప్‌కార్న్ ప్యాకింగ్ చేయ‌క‌పోతే.. 5 శాతం జీఎస్టీ.
  • రెడీ టు ఈట్ పాప్ కార్న్‌.. ప్యాకింగ్ చేసి.. కంపెనీ లేబుల్ వేస్తే.. 12 శాతం జీఎస్టీ.
  • పంచదార కలిపిన పాప్‌కార్న్, కారామెల్ పాప్‌కార్న్‌ల‌పై 18 శాతం జీఎస్టీ.

వాహ‌నాల‌పై మోత ఇదీ..

  • ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌, సహా పాత లేదా సెకండ్ సేల్‌ కార్ల విక్రయాలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 18-28 శాతానికి పెంచారు.
  • వీటిలోనూ 5 ఏళ్లు పాత‌బ‌డిన వాహ‌నంపై 18 శాతం జీఎస్టీ
  • 5-10 ఏళ్ల మ‌ధ్య పాత‌బ‌డిన వాహ‌నంపై 28 శాతం జీఎస్టీ విధించ‌నున్నారు.

ధ‌ర‌లు త‌గ్గేవి ఇవీ..

  • ఇంటికి వినియోగించే ఫ్లైయాష్ ఇటుక‌లపై 18 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ త‌గ్గించారు.
  • విటమిన్లు, మినరల్స్‌ యాడ్‌ చేసిన బలవర్ధకమైన బియ్యం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.
  • స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 18 శాతం జీఎస్టీని 12 శాతానికి త‌గ్గించారు.

This post was last modified on December 21, 2024 5:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

6 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

10 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

11 hours ago