ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనేక వందల సమావేశాలకు హాజరయ్యారు. అనేక లక్షల మంది అభిమానులు, కార్యకర్త లతోనూ అనేక సందర్భాల్లో ఆయన భేటీ అయ్యారు. అయితే.. ఎప్పుడు ఎవరు కోరినా.. ఆయన ఆప్యాయంగా పలకరిస్తారు. తనకు తెలియనివారితోనూ నవ్వుతూ పలకరిస్తారు. ఇక, ఎవరైనా ఆటోగ్రాఫ్(చిరు సంతకం) అడిగితే కాదనకుండా ఇస్తారు. అయితే.. ఇలా ఎప్పుడు ఆటో గ్రాఫ్ ఇచ్చినా.. పుస్తకాలు.. పేపర్లపై మాత్రమే ఆయన చేయడం గమనార్హం.
కానీ, తాజాగా ఓ వీరాభిమాని కోరికను సంచలన రీతిలో చంద్రబాబు నెరవేర్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఈడుపుగల్లులో పర్యటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీబీఎన్ ఆర్మీ(చంద్రబాబునాయుడు సైన్యం) కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ వీరాభిమాని, సీబీఎన్ ఆర్మీ కార్యకర్త చంద్రబాబు వద్దకు వచ్చి.. ఆటోగ్రాఫ్ అడిగారు. సహజంగానే చంద్రబాబు ఆటోగ్రాఫ్ అంటే.. ఏ పుస్తకమో.. కాయితమో ఇస్తారని అనుకున్నారు. వెంటనే పెన్ను తీశారు.
కానీ, ఆ వీరాభిమాని మాత్రం పుస్తకం.. కాయితం వంటివి కాకుండా.. తన గుండెలపైనే ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరారు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన చంద్రబాబు.. ముందు వద్దన్నారు. కానీ, ఆ అభిమాని పదే పదే కోరడంతో కరిగిపోయారు. తన చేవ్రాలును అభిమాని గుండెలపై ఉన్న పసుపు చొక్కాపై చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. అనంతరం.. చంద్రబాబు సదరు అభిమాని వివరాలు తెలుసుకుని.. మంచి భవిష్యత్తు ఉంటుందని.. ఇలానే పనిచేయాలని సూచించారు.
This post was last modified on December 20, 2024 10:36 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…