Political News

ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన

ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్ ఫేక్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసేవారికన్నా దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. ఇక, ఒక ఉద్దేశ్యంతో నేతలు మాట్లాడిన మాటలను తమకు అనుకూలంగా ప్రచారం చేసే ప్రత్యర్థి మీడియాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కీలక సూచన చేశారు.

ఢిల్లీలో పార్లమెంటు దగ్గర పరిణామాలపై కేబినెట్ భేటీలో చర్చించిన చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, కాంగ్రెస్ హయాంలోనే ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందన్న అంశంపై చర్చ జరగాలని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని, మంచి ఉద్దేశంతో మాట్లాడినా చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని దిశానిర్దేశం చేశారు. గతంలో తాను వ్యవసాయం దండగ అని అనకపోయినా అన్నట్టుగా దుష్ప్రచారం చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక, ఉదాసీనంగా ఉండొద్దని, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ అభిప్రాయ సేకరణ జరుపుతున్నానని అన్నారు. మంత్రుల పనితీరు, ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నామని తెలిపారు. 6 నెలల పనితీరుపై నిమ్మల రామానాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని, మిగతా వారు ఇవ్వలేదని కాస్త అసహనం వ్యక్తం చేశారు.

పేషీలకు పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని మంత్రులకు సూచించారు.
సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపు ధోరణి వద్దని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని హితవు పలికారు.

This post was last modified on December 19, 2024 10:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

39 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago