ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు.
అయితే, ఆ సినిమాకు కేవలం 1,863 వ్యూవ్స్ మాత్రమే రావడం గమనార్హం. అంటే, ఒక్కో వ్యూవ్ కు 11 వేలు చెల్లించినట్లుగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వారిపై సెటైర్ వేసేలా వ్యూహం సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక వర్మ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈవెంట్స్ లలో వైసీపీ నేతలు అంబటి, రోజా కూడా పాల్గొన్నారు.
అప్పట్లో ఈ సినిమా విషయంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. వైసీపీ నేతలు ఫండింగ్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఖజానా తెలివిగా ఖర్చు చేసినట్లు జీవీ రెడ్డి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఆరంభించిన ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లక్షల మంది ప్రజలకు తక్కువ ధరలో ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులు అందించినట్టు గుర్తు చేశారు.
అయితే, వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలకు దూరమైందని, కనెక్షన్ల సంఖ్య 2019 నాటికి ఉన్న పది లక్షల నుంచి ప్రస్తుతం ఐదు లక్షలకు పడిపోయిందని జీవీ రెడ్డి ఆరోపించారు. అవకతవకలతో ఫైబర్ నెట్ నష్టపోయిందని స్పష్టంచేశారు. అక్రమంగా నియమించబడిన సిబ్బందిని తొలగించడమే కాకుండా, ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాక, కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి, కొత్త ప్రణాళికలతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
This post was last modified on December 19, 2024 2:37 pm
హారర్ కామెడీ జానర్లో ప్రేక్షకులని ఆకట్టుకున్న కాంచన సిరీస్లో మరో సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ దర్శకత్వం…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…