వైసీపీ అధినేత జగన్ పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 4 వేల కోట్ల రూపాయలను నష్టపరిచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును కూడా ఇష్టానుసారం సొంతానికి వాడేసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకం కింద.. రాష్ట్రానికి 4 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు. అయితే.. ఆ సొమ్మును జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు.
విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పాలనను దుయ్యబట్టారు. కనీసం సామాన్యులకు చుక్క నీరు అందించాలన్న స్పృహ కూడా గత ప్రభు త్వానికి లేకుండా పోయిందన్నారు. ప్రాణాధారమైన నీటిని అందించడంలోనూ శ్రద్ధ చూపలేదన్నారు. తాను చేసిన వారాహి యాత్రల్లో అనేక మంది మహిళలు బిందెలు పట్టుకుని వచ్చారని.. తమకు తాగు నీరు కూడా ఇవ్వడం లేదని అప్పట్లో తనకు చెప్పారని అన్నారు.
మహిళల నీటి కష్టాలు చూసి తన మనసు కరిగిపోయిందని పవన్ కల్యాణ్‌చెప్పారు. అందుకే తాను జల జీవన్ మిషన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వివరించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే వరకు తన మనసు కుదుట పడదని వ్యాఖ్యానించారు. నీటి సమస్యతో అనేక మంది పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యతగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదిస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో తాను ఉన్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి వ్యక్తికీ వ్యతిగత అవసరాల కోసం రోజుకు 55 లీటర్ల నీటిని అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను రెండు సార్లు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా జల జీవన్ మిషన్‌పైనే ఎక్కువగా చర్చించినట్టు తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం.. 70 వేల కోట్లను కేటాయించిందన్నారు.
This post was last modified on December 18, 2024 1:59 pm
కొన్నిసార్లు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ రికార్డులు సాధించిన సినిమాలు తీరా ఓటిటిలో వచ్చాక ఆశించిన స్పందన తెచ్చుకోలేక నీరసపడతాయి.…
ఇటీవల నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ధనుష్తో గొడవ నేపథ్యంలో వీరి గురించి…
ఆర్థిక నేరస్తుడు.. ప్రస్తుతం బ్రిటన్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త.. కింగ్ ఫిషర్ వ్యవస్థాపకుడు.. విజయ్ మాల్యా ఆస్తులు అమ్మేసినట్టు కేంద్ర…
తెలంగాణలో చిత్రమైన రాజకీయం తెరమీదికి వచ్చింది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నాయకులు మంత్రులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.…
టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు అనంతరం అశ్విన్ రిటైర్మెంట్…
నాలుగు దశాబ్దాలకు పైబడిన సుదీర్ఘ నటప్రయాణంలో చిరంజీవి చూడని ఎత్తుపల్లాలు లేవు. కొత్తగా ఋజువు చేసుకోవాల్సింది లేదు. అయినా సరే…