జమిలి ఎన్నికలకు జై కొడుతూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశ పెట్టబోతున్నారు. దాదాపుగా ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. ఈ క్రమంలోనే 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి బిల్లు ఆమోదం పొందినా 2029లోనే జమిలి ఎన్నికలు జరుగుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు.
“వన్ నేషన్-వన్ ఎలక్షన్” కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. అయితే, జమిలిపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవటానికి 2027లోనే ఎన్నికలు అని చెబుతున్నారని విమర్శించారు. కానీ, వైసీపీ నేతల మాటలపై ప్రజలు విశ్వనీయత కోల్పోయి చాలాకాలం అయిందని చెప్పారు. వైసీపీ నేతల డ్రామాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీలు మొదలు స్కూళ్ల వరకు అంతటా దీనిపై చర్చ జరగాలని చెప్పారు. విజన్ 2020 ఏ విధంగా సాకారమైందన్న విషయాన్ని ఈ తరం తెలుసుకోవాలని అన్నారు. 1996 నాటికి 2020 నాటికి పరిస్థితులలో తేడాను ఈ తరం గుర్తించాలని చెప్పారు. విజన్-2020 మాదిరే విజన్- 2047 కూడా సక్సెస్ అవుతుందని అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నం అని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు – సమాధానాల రూపంలో నిర్వహిస్తామని చెప్పారు. ఇకపై కలెక్టర్లు, ఎస్పీలకు ముందుగానే మీటింగ్ ఎజెండా చెబుతామని, వాటిపై సమాధానాలు కోరతామని అన్నారు.
This post was last modified on December 14, 2024 1:25 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…