Political News

ఏపీలో ‘వాట్సాప్ పాల‌న‌’.. చంద్ర‌బాబు విజ‌న్ ఏంటి?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం డిజిట‌ల్ పాల‌న దిశ‌గా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క‌మైన ముంద‌డుగు ప‌డుతోంది. జ‌న‌వ‌రి నుంచి ‘వాట్సాప్ పాల‌న’కు శ్రీకారం చుడుతోంది. ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని సేవ‌ల‌ను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించ‌నున్నారు. దీనికి జ‌న‌వ‌రి 1వ తేదీన ప్రారంభించేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ విష‌యాన్నితాజాగా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. వాట్సాప్ పాల‌న స‌క్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవ‌లు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.

ఏంటీ పాల‌న‌..

వాట్సాప్ అనేది.. ప్ర‌జ‌ల‌తో విడ‌దీయ‌రాని బంధం ఏర్ప‌రుచుకున్న విష‌యం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధార‌ణ జ‌న‌జీవ‌నంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాల‌న‌కు అన్వ‌యించ‌డం అనేది భార‌త దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్ర‌స్తుతం దుబాయ్ దేశంలో ఈ త‌ర‌హా సేవ‌లు అందుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు వాట్సాప్‌లో కొన్ని బ్యాంకు సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వ‌ర‌కు.. వాట్సాప్ సేవ‌లు అందుతున్నాయి. ఈ త‌ర‌హాలోనే ప్ర‌భుత్వం కూడా వాట్సాప్ సేవ‌లు అందించ‌నుంది. ఎడారి దేశం దుబాయ్‌లో ఈ ప్ర‌యోగం స‌క్సెస్అయింది.

ఏం చేస్తారు?

  • వాట్సాప్ ద్వారా ప్ర‌జ‌ల‌కు అవసరమైన అన్ని ర‌కాల‌ సర్టిఫికేట్లను పొందవచ్చు.
  • వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి వివ‌రించి.. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప‌రిష్కారం పొందే వీలుంటుంది.
  • యూఏఈ(దుబాయ్‌) తర్వాత ఈ సేవలు తీసుకొస్తోంది ఏపీనే.
  • వాట్సాప్‌లో వ‌చ్చే అన్ని అంశాల‌ను Ap.gov.in సైట్ లో ఉంచుతారు.
  • వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అయింది.
  • వాట్సాప్ ద్వారానే సులభంగా పన్నులు చెల్లించ‌వ‌చ్చు.
  • వాట్సాప్ ద్వారా దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలు చేరువ కానున్నాయి.
  • ఫేజ్-1లో 100 నుండి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
  • ఇన్‌క‌మ్‌, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్‌ లను వాట్సాప్ ద్వారా పొంద‌వ‌చ్చు.

This post was last modified on December 12, 2024 9:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

41 minutes ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

4 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

5 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

5 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

7 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

8 hours ago