Political News

మెగాస్టార్ ఫ్యామిలీ రేర్ పొలిటిక‌ల్‌ రికార్డ్‌…!


ఒకే కుటుంబంలో అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్లు అందరూ డాక్టర్లు లేదా ఇంజనీర్లు లేదా టీచర్లు.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండటం ఎన్నో సందర్భాలలో చూశాం. ఇలా ఫ్యామిలీ అంతా ఒకే బాటలో ఉంటారు. అయితే రాజకీయంగా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. మంత్రులు అవుతూ ఉండటం చూసాం.

చంద్రబాబు కుటుంబం దివంగత ఎర్రం న్నాయుడు కుటుంబం.. ఆదిరెడ్డి కుటుంబం ఇలా చెప్పుకుంటూ పోతే ఒకే టైంలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు.. నలుగురు కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి కూడా చెప్పుకోవాలి. చిరంజీవి కుటుంబం నుంచి టాలీవుడ్ లో చాలామంది హీరోలు అయ్యారు. చిరంజీవి స్వయంశక్తితో… స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగారు. ఆయన బాట‌లోనే తమ్ముళ్లు నాగబాబు – పవన్ కళ్యాణ్ ప్రయాణించారు.

ఆ తర్వాత చిరంజీవి వారసులు మేనల్లుళ్లు.. బావమరిది అల్లు అరవింద్ కుమారులు ఎలా ఒకరి తర్వాత ఒకరు సినిమాల్లోకి వచ్చి మెగా అండతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. నాగబాబు హీరోగా సక్సెస్ కాలేదు.. నిర్మాతగాను సక్సెస్ కాలేదు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టీవీ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇదే క్రమంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి – పాలకొల్లు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పాలకొల్లులో ఓడి.. తిరుపతిలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అన్న పార్టీ పెట్టగానే తమ్ముళ్లు ఇద్దరు కూడా అందులో యాక్టివ్ రోల్ పోషించారు.

ఆ త‌ర్వాత చిరు రెండో త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన స్థాపించి టీడీపీతో పొత్తులో పోటీ చేసి పిఠాపురం ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఏపీ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక జ‌న‌సేన‌లో కీల‌క పాత్ర పోషించిన మ‌రో సోద‌రుడు నాగ‌బాబు కూడా ఇప్పుడు మంత్రి కాబోతున్నారు. ఇలా సినిమా కుటుంబం నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ముగ్గురు సొంత అన్న‌ద‌మ్ములు కూడా మంత్రి అవ్వ‌డం అరుదైన రికార్డ్‌. ఈ రికార్డు ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో మెగా కుటుంబం పేరు మీద లిఖించ‌బోతోంది.

This post was last modified on December 11, 2024 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

9 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

35 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago