వైసీపీలో చిత్రమైన రాజకీయాలు కొనసాగుతున్నాయి. జగన్‌ను నమ్మిన వారు.. కొందరైతే, జగనే స్వయం గా నమ్మిన నాయకులు మరికొందరు. ఈ రెండు వర్గాలతోనూ.. పార్టీకి కానీ, అధినేతకు కానీ ఒరిగింది ఏమైనా ఉందా? అంటే చెప్పడం కష్టంగానే ఉందనాలి. ఎందుకంటే.. రాజకీయంగా కొందరిని జగన్ ప్రొత్సహించారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ నాయకులు ఉన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ నాయకులు పార్టీని బాగానే చూస్తున్నారు.
కానీ, వీరితో పోల్చుకుంటే.. టీడీపీని దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో బీసీలకు జగన్ ఎక్కువగా పదవులు పంచా రు. రాజ్యసభ నుంచి మంత్రివర్గం వరకు అనేక మందికి ఆయన పదవులు పంపిణీ చేశారు.కానీ, వీరు మాత్రం పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. జంపింగుల బాట పట్టారు. దీంతో జగన్ నమ్మి.. పదవులు ఇచ్చిన వారంతా కూడా.. సగానికిపైగానే పార్టీకి దూరమయ్యారు. ఇక, జగన్‌ను నమ్మిన వారి విషయానికి వస్తే.. ఈ జాబితా పెద్దదిగానే ఉంది.
ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రుడ్డి సహా అనేక మంది ఈ జాబితాలోనూ ఉన్నారు. అయితే.. వీరిలో పదవులు దక్కని వారే ఉన్నారు. ఆది నుంచి పార్టీకి కంటికి రెప్పగా వ్యవహరించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. వారందరికీ జగనే సర్వస్వం. అయితే.. వీరికి మా త్రం జగన్ పెద్దగా పదవులు ఇచ్చింది లేదు. ఇస్తానని చెప్పింది కూడా లేదు. దీంతో వీరిలో అసంతృప్తి పెరిగిపోయింది.
అంటే.. ఇతమిత్థంగా.. పార్టీ కోసం ఎంత కష్టపడినా.. చివరి నిముషంలో ఎలాంటి మార్పులు జరుగుతా యో.. ఎవరికి పదవులు దక్కుతాయో.. అనే ఆవేదన, ఆందోళన వంటివి జగన్‌ను నమ్మిన నాయకుల్లో స్ప ష్టంగా కనిపిస్తుండడంగమనార్హం. దీంతో వారంతా పార్టీలోనే ఉన్నప్పటికీ.. యాక్టివ్‌రోల్ అయితే పోషించ డం లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్నవారికి జగన్ భరసా ఇవ్వాల్సి ఉంటంది. సామాజిక వర్గాల ప్రాతిపదికన కాకుండా.. కష్టపడే వారి ప్రాతిపదికగా .. ఆయన ప్రాధాన్యం ఇస్తే.. పార్టీ పరుగులు పెడుతుందని అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on December 8, 2024 8:52 pm
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…