కడప మున్సిపల్ స్కూల్ లో జరిగిన పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధ్యాపకులు, విద్యార్థుల గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల మీద కాకుండా అధ్యాపకుల మీద పెట్టబుడులు పెట్టాలని, అధ్యాపక వృత్తి హయ్యెస్ట్ పెయిడ్ జాబ్ గా ఉండాలని పవన్ ఆకాంక్షించారు. అందుకోసం తన వంతు ప్రయత్నం చేస్తానని పవన్ అన్నారు.
తాను ఒక సినిమా హీరోగా చెబుతున్నానని, సినిమాల్లోనే విద్యార్థులు హీరోలను చూసుకోవద్దని, అధ్యాపకులలో కూడా హీరోలుంటారని పవన్ చెప్పారు. విద్యార్థులకు ఒక మహిళా పీఈటీ టీచర్ రెజ్లింగ్ లో అద్భుతంగా శిక్షణ ఇచ్చారని, ఆ విద్యార్థులు వెళ్లి బ్రాంజ్ మెడల్ సాధించారని, తన దృష్టిలో ఆవిడ హీరో అని పవన్ చెప్పారు. తనకు అధ్యాపకులంటే చాలా గౌరవమని పవన్ అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు, ముగ్గరు పిల్లలను హ్యాండిల్ చేయడమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో, సెక్షన్ కు 30 మంది పిల్లలను టీచర్లు హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదని అన్నారు.
పిల్లల చదువు, వికాసం కోసం ప్రభుత్వాలు ట్యాబ్ లు ఇస్తున్నాయని, అయితే, ఆ ట్యాబ్ లు వారు దేనికి వాడుతున్నారు, చెడు మార్గాలవైపు వెళుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకం, చెడు ప్రభావాల గురించి పిల్లలకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అన్నారు. కడప నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారని, అయితే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది కాదని…ఏం చేశారు అన్నది ముఖ్యమని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఒకేలా చూడాలని హితవు పలికారు.
This post was last modified on December 8, 2024 6:53 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…