అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ విజయానికి టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కీలక మద్దతు అందించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ట్రంప్ గెలుపు కోసం మస్క్ తన భారీ ఆర్థిక సాయాన్ని వినియోగించి, హై రేంజ్‌లో ప్రచారం నిర్వహించారు.
అమెరికా ఫెడరల్ ఫైలింగ్ విడుదల చేసిన వివరాల ప్రకారం, ట్రంప్ విజయానికి మస్క్ సుమారు 270 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2 వేల కోట్లు. ఈ మొత్తం ద్వారా మస్క్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. అలాగే ట్రంప్ ప్రచార ర్యాలీలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
ట్రంప్ తరఫున ప్రధానంగా పొలిటికల్ యాక్షన్ కమిటీ (PAC) నిర్వహించిన ప్రచారానికి మస్క్ 238 మిలియన్ డాలర్ల విరాళం అందించారు. అదనంగా, 20 మిలియన్ డాలర్లు RBG PACకి కూడా అందించారు. దీంతో మస్క్ ఇప్పటివరకు ట్రంప్ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన వ్యక్తిగా నిలిచారు. 2020 ఎన్నికల్లో టిమ్ మెల్లన్ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేయగా, ఈసారి మస్క్ ఆ రికార్డును అధిగమించారు.
ట్రంప్ గెలుపు తర్వాత మస్క్‌కు తన కేబినెట్‌లో కీలక స్థానం కల్పిస్తానని ట్రంప్ చేసిన వాగ్దానం నిజమైంది. మస్క్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) బాధ్యతలు అప్పగించారు. ఈ విభాగం ప్రభుత్వం వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ బాధ్యతలతో మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సంఘటన మస్క్ రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది.
This post was last modified on December 7, 2024 10:26 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…