ప్రస్తుతం ఏపీలో ఉన్న కూటమి సర్కారు గత వైసీపీ సర్కారు తప్పులను లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక సహా.. అనేక వ్వవస్థలను బాగు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు గ్రామీణ స్థాయిలో వైసీపీ నేతలు చేసిన తప్పులను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో శుక్రవారం(డిసెంబరు 6) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజలు పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఈ సదస్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన ‘రీసర్వే’ ద్వారా అనేక మంది రైతుల భూములు అన్యాక్రాంత మయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా లేని వారికి కొత్తగా భూములు దఖలు పడ్డాయి. అంటే.. మూడు సెంట్లు ఉన్నవారికి మూడు ఎకరాలు ఉన్నట్టుగా రికార్డుల్లో నమోదు చేశారు. ఇది తప్పు వల్ల జరిగిందో ఉద్దేశ పూర్వకంగా జరిగిందో తేల్చనున్నారు. ఇలాంటి అనేక సమస్యలపై దృష్టి పెట్టనున్నారు.
అలాగే.. వైసీపీ నాయకులు కబ్జా చేసిన భూములను కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. చిన్న కాయితంపై రాసి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా మూలాల్లోకి వెళ్లి గుట్టును వెలికి తీయాలని అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ సదస్సులకు మంత్రులు కూడా హాజరు కానున్నారు. తద్వారా మరింత పారదర్శకంగా ఈ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపించినట్టు అయింది.
ఇదే విషయాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణులను ఆయన కోరారు. ఇది చక్కటి అవకాశంగా పేర్కొన్న అయ్యన్న.. రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. దీనికి సంబంధించి ఆయన సెల్పీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తద్వారా వైసీపీ గ్రామస్థాయి నాయకుల అక్రమాలను వెలికి తీయనున్నట్టు పేర్కొన్నారు.
This post was last modified on December 5, 2024 3:49 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…