ఐటీ శాఖా మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అది కాకుండా, ఎక్స్ లో, మీడియాలో, తన కార్యాలయం ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా నాయకుడు అనిపించుకుంటున్నారు లోకేశ్. ఎన్నికలై పోయాయి…జనంతో ఏం పని అనుకోకుండా జనంతోనే మనం అన్న రీతిలో లోకేశ్ ప్రజలతో మమేకమవుతూ వారి కష్టసుఖాలలో అండగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలోనే సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్ ను లోకేేశ్ రద్దు చేయించారు.కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్న లోవరాజు సస్పెండ్ అయ్యారు. బస్సు డ్రైవ్ చేస్తుండగా ఓ ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సును కాసేపు ఆపాల్సి వచ్చింది. దీంతో, ప్రయాణికులను ఎంటర్ టైన్ చేద్దామని లోవరాజు బస్సు దిగి సరదాగా దేవర సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు.
అయితే, ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. లోవరాజు డ్యాన్స్ కు కాంప్లిమెంట్స్ వచ్చాయి..ఉద్యోగం పోయింది. దీంతో, లోవరాజు సస్పెన్షన్ ను లోకేశ్ రద్దు చేయించారు. దీంతో, లోకేష్ ను లోవరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ధన్యవాదాలు చెప్పారు. లోకేశ్ కు అన్ని విధాలా అండగా ఉంటానని లోకేశ్ హామీనిచ్చారు.
This post was last modified on December 4, 2024 10:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…