గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ భారీగా అక్రమాలు, దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపు 160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో, విచారణ జరిపిన అధికారులు వెంకట రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో, వెంకటరెడ్డిని సెప్టెంబరులో అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
అయితే, జైలులో వెంకటరెడ్డికి రాజభోగాలు అందుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జైల్లో కొత్త టీవీ, కొత్త ఫ్రిడ్జ్, బయటి భోజనం…ఇలా వెంకట రెడ్డిని జైల్లో సిబ్బంది కొత్త పెళ్లి కొడుకులా చూస్తున్నారట. ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో జైలు సిబ్బందిపై ఆయన ఫైర్ అయ్యారట. జైల్లో వెంకట రెడ్డి వంటి వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. అంతేకాదు, వెంకట రెడ్డికి ఎవరు సహకరించారో పూర్తి వివరాలు ఇవ్వాలని చంద్రబాబు హుకుం జారీ చేశారట.
అంతకుముందు కూడా వైసీపీ మాజీ నేత బోరుగడ్డ అనిల్ కు కూడా పోలీస్ స్టేషన్లో వసతులు కల్పించడం, స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో భోజనం పెట్టించడం వంటి వ్యవహారాలపై విమర్శలు వచ్చాయి. ఇక పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ కు, ఆయన కోసం వచ్చిన బంధువులకు కుర్చీలు వేసి పోలీసులు మర్యాదలు చేయడంపై దుమారం రేగిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 30, 2024 4:36 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…