కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్ గా మార్చారని, రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని పవన్ ఆరోపించారు. ఇంటర్నేషనల్ గా ఈ స్మగ్లింగ్ రాకెట్ నడుస్తోందని, అయినా సరే ఎవ్వరినీ వదిలిపెట్టబోనని పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
పోర్టు అధికారులకు, సిబ్బందికి బాధ్యత లేదని, జవాబుదారీ తనం లేదని, వారందరూ ఈ స్మగ్లింగ్ రాకెట్ కు బాధ్యులేనని, వారిపై తగు చర్యలు తీసుకుంటామని గట్టిగా చెప్పారు. కాకినాడ పోర్టుకు వస్తానంటే కొందరు తనను రానివ్వలేదని, రెండు నెలలుగా అడ్డుకుంటున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అయిన తనకే పోర్టు అధికారులు సహకరించలేదని, మంత్రి నాదెండ్ల, ఎమ్మెల్యే కొండబాబుల పరిస్థితి ఏంటని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో కిలో రేషన్ బియ్యాన్ని 73 రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
ఈ ధందా చేసేవారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పారు. ఇంటర్నేషనల్ అయినా తాను లెక్క చేయబోనని, ఆ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న షిప్ ను సీజ్ చేయాలని పవన్ అంటున్న వీడియోలను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళుతూ పోర్ట్ అధికారులను పవన్ హెచ్చరిస్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
This post was last modified on November 29, 2024 5:55 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…