కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యం రవాణా నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు అధికారులపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రో్జు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు ఇక్కడకు రావని గ్యారెంటీ ఏంటని పవన్ ప్రశ్నించారు.
కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం కాకినాడ తీర ప్రాంతానికి లేదా అని సీరియస్ అయ్యారు. కాకినాడు పోర్టులో తనను పర్యటించనీయకుండా 2 నెలల నుంచి అడ్డుకుంటున్నారని, ఇక్కడ మాఫియా ఎంత గట్టిగా ఉందో అర్థమవుతోందని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఉగ్రవాదులు ముంబై వంటి పెద్ద నగరాల నుంచే దేశంలోకి ప్రవేశించడం లేదని, కాకినాడ వంటి చిన్న తీర ప్రాంతాలలో కూడా చొరబడే అవకాశముందని అన్నారు. చిన్న 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడా కాల్చేస్తే దిక్కులేదు…25వేల టన్నుల హెరాయిన్ విశాఖలో దొరికింది. ఇలాగే వదిలేస్తే కాకినాడ పోర్టులో జరుగుతున్న అక్రమ బియ్యం రవాణా, నిఘా వైఫల్యంపై జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తనను రెండు నెలలుగా కాకినాడ పోర్టును సందర్శించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి డ్రగ్స్, ఆయుధాలు వెళ్లలేదని, వెళ్లబోవని గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించారు. అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం పూర్తి విఫలమైందని మండిపడ్డారు. దేశ భద్రతకు భంగం కలుగుతోందని తాను భావిస్తున్నానని, అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు, దాని వెనుక ఉన్న వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేస్తామన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, హోం మినిస్టర్ వంగలపూడి అనిత, కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించేందుకు, కాకినాడ పోర్టు అక్రమ రవాణా కార్యకలాపాలపై లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శికి పవన్ ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ పోర్టుకు సంబంధించిన అధికార యంత్రాంగంలో కూడా ప్రక్షాళన జరగాలని అన్నారు. కాకినాడ పోర్టుపై తాను ఫోకస్ చేస్తానని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పానని, మరోసారి కలిసి పూర్తిగా ఇక్కడ జరిగే విషయాలు వివరిస్తానని చెప్పారు.
This post was last modified on November 29, 2024 5:26 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…