Political News

ఉండి టాక్‌: ర‌ఘురామ‌.. హ్యాపీయేనా…!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ రాజు ఆనంద ప‌డుతున్నారా? సంతోషంగానేఉన్నారా? ఇదీ.. ఇప్పు డు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తున్న టాక్‌. ఎందుకంటే.. ర‌ఘురామ కోరుకున్న విధంగా నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌చ్చు. కానీ, గ‌త వారం ప‌దిరోజుల చ‌రిత్ర‌ను గ‌మ‌నిస్తే.. ర‌ఘురామ కోరుకుంటున్న‌ట్టుగానే ప‌రిస్థితులు మారుతున్నాయి. ఆయ‌న కోరుకున్న‌ట్టే జ‌రుగుతున్నాయి.

1) ప‌ద‌వి ప‌రంగా త‌న‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుకున్నారు ర‌ఘురామ‌. నిజానికి ఎన్నిక‌ల‌కు ముందు అస‌లు టికెట్ ద‌క్కుతుందా? లేదా? అన్న సందేహం నుంచి టికెట్ దక్కేవ‌ర‌కు టెన్ష‌న్ టెన్ష‌న్‌. చివ‌ర‌కు టికెట్ ద‌క్కింది. అయితే.. ఎమ్మెల్యేగానే ఉండిపోవాలా? ఐదేళ్ల‌పాటు వైసీపీని ఏకేశాను.. టీడీపీకి ద‌న్నుగా మారానంటూ.. ర‌ఘురామ చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్పీక‌ర్‌వంటి కీల‌క ప‌ద‌విని ఆశించారు. కానీ, ఆయ‌న‌కుద‌క్క‌లేదు. ఇక‌, ఇటీవ‌లే డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ద‌క్కింది. దీంతో హ్యాపీ.

2)2022లో త‌న‌ను అరెస్టు చేసి అక్ర‌మంగా నిర్బంధించార‌ని.. కొట్టార‌ని ఆరోపిస్తూ.. ర‌ఘురామ అప్ప‌ట్లోనే న్యాయ పోరాటం చేశారు. అయితే.. దీనిని అప్ప‌ట్లో సీరియ‌స్గా తీసుకోలేదు. కానీ, నెల రోజుల కింద‌ట గుంటూరు పోలీసుల‌కు ర‌ఘురామ చేసిన ఫిర్యాదు, త‌ద‌నంతరం జ‌రిగిన మార్పుల‌తో ఇప్పుడు ర‌ఘురామ‌కు ఆనందం క‌లిగించే చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయి. ఈ కేసులో త‌న‌ను కొట్టార‌ని ఆరోపిస్తున్న మాజీ ఏ ఎస్పీ విజ‌య్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

3)తాను డిప్యూటీ స్పీక‌ర్ అయినా.. ఏపీ రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయినా.. కేంద్రంలోని పెద్ద‌ల‌తో సంబంధాల‌ను కొన‌సాగించాల‌న్న‌ది ర‌ఘురామ ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్రంతో త‌ర‌చుగా స‌త్సంబంధాల‌ను కొన‌సాగించాల‌ని చూస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ర‌ఘురామ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దుపై తాను దాఖ‌లు చేసిన పిటిష‌న్‌గురించి ఆయ‌నకు వివ‌రించిన‌ట్టు స‌మాచారం. మొత్తంగా.. ర‌ఘురామ హ్యాపీ.. ఉండి టాక్ ఇదే!

This post was last modified on November 28, 2024 5:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

https://youtu.be/yCkl2Z3PBs0?si=YrheiH3HjVyB7nwZ పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు,…

3 hours ago

డబ్బింగ్ హడావిడి లేని మరో సంక్రాంతి

ప్రతి సంవత్సరం టాలీవుడ్ సంక్రాంతికి ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగుదునమ్మా అంటూ తమిళ డబ్బింగులు రావడం ఏళ్లుగా జరుగుతున్న…

4 hours ago

‘కుప్పం’ రుణం తీర్చుకుంటున్న చంద్ర‌బాబు!

రాష్ట్రానికి సంబంధించి విజ‌న్‌-2047 ఆవిష్క‌రించిన సీఎం చంద్ర‌బాబు.. తాజాగా త‌న సొంత నియోజ‌క వ‌ర్గం.. 35 ఏళ్ల నుంచి వ‌రుస…

6 hours ago

చంద్ర‌బాబు సూప‌ర్‌ విజ‌న్‌.. జ‌గ‌న్ ది డెట్ విజ‌న్‌!: నారా లోకేష్‌

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అప్పులు చేయాల్సి వ‌స్తోంద‌ని మంత్రి నారా లోకేష్ చెప్పారు. అయితే..ఈ పాపం అంతా వైసీపీ అధినేత‌,…

6 hours ago

లైకా వాయిదా ట్విస్టు… మైత్రి మాస్టర్ స్ట్రోకు

గత ఏడాది ది రాజా సాబ్ కు అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10. కానీ ఇప్పుడా…

7 hours ago

ట్రైలరుతోనే ట్రోల్ అయిపోయిన రవికుమార్…

కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…

8 hours ago