వైసీపీ హయాంలో పోలవరం పనులు నత్తనడకన సాగిన వైనంపై విమర్శలు వెల్లువెత్తాయి. నీటిపారుదల శాఖకు జగన్ హయాంలో ఇద్దరు మంత్రులుగా పనిచేసినా ఉపయోగం లేదని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై విమర్శలతో బిజీగా ఉన్న అనిల్, అంబటి..పోలవరంపై ఫోకస్ చేయలేదని ట్రోలింగ్ జరిగింది. అసలు పోలవరం పనుల పురోగతి ఏమిటి అన్న విషయాలు కూడా జనానికి తెలియనివ్వలేదు. అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖా మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు మాత్రం అందుకు భిన్నంగా పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
పోలవరం పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న నిమ్మల…సీఎం చంద్రబాబు చెప్పినట్లు 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్సైటును ప్రారంభించాలని అధికారులను నిమ్మల ఆదేశించారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు పోలవరం పనుల పురోగతిని ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, ఆయా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీల ప్రతినిధులతో నిమ్మల భేటీ అయ్యారు. డిసెంబరు మొదటివారంలో పోలవరంలో చంద్రబాబు పర్యటించబోతున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనుల షెడ్యూలుపై అధికారులతో నిమ్మల సమీక్ష జరిపారు.
పోలవరంతో పాటు హంద్రీ-నీవా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాజెక్టుల పనులపై కూడా నిమ్మల చర్చించారు. ఆర్దిక ఇబ్బందులను అధిగమించి వాటిని త్వరితగతిన పూర్తి చెయడంపై దృష్టిసారించాలని అన్నారు. డిసెంబరు 8న జరగబోతున్న సాగు నీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆ సంఘాల ద్వారా కాలువలు, డ్రైన్స్ వంటి పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.
This post was last modified on November 28, 2024 2:24 pm
నిన్న కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహించిన 'పుష్ప 2: ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, రష్మిక…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ…
అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి…
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. అందుకే ఫాన్స్…
అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు…
థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత…