అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. భవిష్యత్తు అంతా డ్రోన్ టెక్నాలజీదేనని, డ్రోన్లను ఉపయోగించి ఇన్విజిబుల్ పోలీసింగ్ తో అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లు, క్రిమినల్స్ ఆట కట్టించవచ్చని సీఎం చంద్రబాబు ఆ సమ్మిట్ లో చెప్పారు. అయితే, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనుకుంటున్న వారికి అది సాధ్యమే అని ఏపీ పోలీసులు నిరూపిస్తున్నారు.
ఇటీవల డ్రోన్లను ఉపయోగించి వందల ఎకరాల గంజాయి పంటను పోలీసులు దగ్ధం చేసిన ఘటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే తరహాలో తాజాగా అనంతపురం జిల్లాలో డ్రోన్లను ఉపయోగించి మందుబాబుల ఆటకట్టించారు పోలీసులు. పట్టపగలే బహిరంగ ప్రదేశాలలో మందేస్తున్న కొందరిని డ్రోన్లు కనిపెట్టాయి. ఇంకేముందు పరుగో పరుగు అంటూ అక్కడి నుంచి పారిపోయారు. పొలాలలో, కాలువ గట్ల మీద, రైల్వే ట్రాక్ ల సమీపంలో మందుబాబులను డ్రోన్లు పరిగెత్తించాయి.
మందుబాబుల సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా కాకుండా డ్రోన్ల సాయంతో రంగంలోకి దిగారు. దీంతో, తమ ముఖం కనిపించకుండా తలా ఓ దిక్కుకు మందుబాబులు పరుగందుకున్నారు. కొందరు మందుబాబులు దొరకడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, డ్రోన్ల చేతికి చిక్కితే అంతే సంగతి అని పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం మందుబాబులు లబోదిబోమని పరిగెతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on November 28, 2024 12:48 pm
నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…