2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు జగన్ ఈవీఎంలపై దండయాత్ర మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. ఏదో జరిగింది..కానీ ఆధారాల్లేవ్…అంటూ ఈవీఎంలపై పరోక్షంగా కామెంట్లతో మొదలుపెట్టిన జగన్…ఆ తర్వాత నేరుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ కామెంట్లు చేయడం మొదలుబెట్టారు. ఆరు నెలలుగా ఈవీఎంల వల్లే ఓడిపోయామంటూ జగన్ ఒకే పాట పాడుతున్నారు. తాజాగా నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈవీఎంలు వద్దు…బ్యాలెట్ పేపర్ ముద్దు అంటూ మరోసారి జగన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ రోజు 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యతను అందరూ గుర్తించాలన్న జగన్…ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని చెప్పారు. అయితే, ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందని, వాటి పనితీరుపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలు బ్యాలెట్ పేపర్ల వైపు మొగ్గు చూపాయని, మనం కూడా ఆ దిశగా అడుగులు ఎందుకు వేయకూడదు అని జగన్ ప్రశ్నించారు.
అయితే, ఈవీఎంలలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, జరిగే అవకాశం కూడా లేదని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు స్పష్టం చేసింది. 2019లో భారీ మెజారిటీతో 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై జగన్ కు అనుమానాలు ఎందుకు రాలేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇకనైనా ఈవీఎంలపై ఏడుపు మానేసి తన పార్టీ నేతలకు విలువ, గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలని అంటున్నారు. జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్న విషయంపై ఫోకస్ చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇకనైనా, నియంతృత్వ ధోరణిని వీడి బూత్ లెవల్ కార్యకర్తలను పట్టించుకోవడం వంటి విషయాలపై జగన్ ఫోకస్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమని, ఓటమిని హుందాగా అంగీరించాలని, ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి ఇలా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఐదేళ్లూ గడిపేస్తే రాబోయే ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని సెటైర్లు వేస్తున్నారు.
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రమోషన్ల విషయంలో మౌనం పాటిస్తూ వచ్చిన విశ్వంభర ఎట్టకేలకు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో…
ఐపీఎల్ 2025: ముంబయి ఇండియన్స్తో జరిగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించిన తరువాత విరాట్ కోహ్లీ వైల్డ్…
ఓ ప్రజా ప్రతినిధి అన్నాక ఎలా ఉండాలి? అది కూడా ఓ శాసన సభ్యుడిగా కొనసాగుతున్న నేత ఎంత జాగ్రత్తగా…
అదేంటి రెండు ఆడేసి వెళ్ళిపోయిన సినిమాలు పరస్పరం కవ్వించుకోవడం ఏమిటని అనుకుంటున్నారా. అసలు మ్యాటర్ వేరే ఉంది. గత ఏడాది…
ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య…