టీడీపీ నాయకుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీరు మారలేదు. ప్రస్తుతం ఉన్న నాయకుల్లో చాలా మంది ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం, వీడియోలు తీయించుకోవడం.. చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇక, మీడియా ముందు చేసే విన్యాసాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి మాత్రం అవన్నీ.. మాయమై.. అసలు నాయకులు బయటకు వస్తారు. దీంతో నాయకులు చెప్పే నీతులు కేవలం కలరింగ్, కవరింగ్ కోసమేనన్న ప్రచారం ఉంది. అయితే.. కలిశెట్టి విషయంలో మాత్రం ఇది నిజం కాదని నిరూపితమైంది.
విజయనగరం పార్లమెంటుస్థానం నుంచి తొలిసారి విజయం అందుకున్న అప్పలనాయుడు.. ఈ ఏడాది పార్లమెంటు సమావేశాలకు తొలిసారి హాజరైనప్పుడు.. ప్రత్యేకంగా కనిపించారు. పూర్తిగా పార్టీ రంగైన పసుపు వస్త్రాలు ధరించి.. 6 కిలో మీటర్ల దూరం లోని ఇంటి నుంచి పార్లమెంటుకు సైకిల్(టీడీపీ ఎన్నికల గుర్తు)పై ఆయన సమావేశాలకు వచ్చారు. ఇది బాగానే ప్రచారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కూడా ఆయనను మెచ్చుకున్నారు. అయితే..”ఫస్ట్ టైమ్ ఎంపీ కదా.. ఫస్ట్ ఫస్ట్ ఇలానే చేస్తారులే.. మీడియాలో కవరేజీ కోసం!” అన్న కామెంట్లు సొంత పార్టీలోనే వినిపించాయి.
అయితే.. కలిశెట్టి వివాదాలకు దూరంగా ఉండే నాయకుడు కావడంతో ఆయా విమర్శలను ఆయన పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు రెండోసారి సభలు ప్రారంభమయ్యాయి. సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు కూడా అచ్చం కలిశెట్టి తొలి సభకు ఎలా అయితే హాజరయ్యారో.. అదే సంప్రదాయాన్ని పాటించారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆయన పార్టీ సింబలైన సైకిల్(దీనిని కూడా విజయనగరం నుంచి ప్రత్యేకంగా ఢిల్లీకి తీసుకువెళ్లారు)పై పార్లమెంటు వరకు తొక్కుకుంటూ వెళ్లారు. ఇదేదో మొహమాటం కోసమో.. కలరింగ్, కవరింగ్ కోసమో కాకుండా.. పూర్తిగా ఆయన సంతృప్తిగా సైకిల్ తొక్కుతూ.. ఎంతో ఆనందంగా పార్లమెంటుకు చేరుకోవడం కనిపించింది.
గతంలో కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లేవారు. అలానే ఒడిసాకు చెందిన బీజేపీ ఎంపీ ఒకరు ప్రస్తుతం సైకిల్‌పైనే వస్తున్నారు. మరికొందరు ఎంపీలు బ్యాటరీ ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్నారు. ఇలా.. ఏపీకి చెందిన ఏకైక ఎంపీ కలిశెట్టి మాత్రమే సైకిల్ తొక్కుతూ.. పార్లమెంటుకురావడం గమనార్హం. దీనివెనుక రెండు కారణాలు ఉన్నాయని ఆయన చెబుతున్నా రు. 1) టీడీపీపై తనకున్న మమకారం. 2) ఢిల్లీలో ప్రస్తుతం పెరిగిపోయిన వాయుకాలుష్యాన్ని తనవంతుగా కొంతైనా తగ్గించడం.(అంటే కారును వాడకుండా ఉండడం).
This post was last modified on November 26, 2024 9:48 am
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…