ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోన అటవీ శాఖతో పాటు పర్యావరణ శాఖపై కూడా పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పర్యాటక శాాఖా మంత్రి కందుల దుర్గేష్ కు తన సలహాలు, సూచనలు అందిస్తూ ముందుకు వెళుతున్నారు పవన్. ఈ క్రమంలోనే ఏపీలో ఫిల్మ్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కందుల దుర్గేష్ కు పవన్ తాజాగా సూచించారు.
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అద్భుతమైన అవకాశాలున్నాయని పవన్ చెప్పారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం డెవలప్ చేసేలా రూపొందించిన కార్యాచరణపై పవన్ సమీక్ష జరిపారు. దాంతోపాటు ఫిల్మ్ టూరిజంపై ఫోకస్ చేయాలని సూచించారు. ఒక సినిమాలో ఒక పర్యాటక ప్రాంతం , ఒక లొకేషన్, ఒక స్పాట్ ను చూపిస్తే అదే పాంప్లెట్ లాగా ఆ ప్రాంతాన్ని ప్రమోట్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం కల్పిస్తే ఏపీలో ఫిల్మ్ టూరిజం డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సినీ ఇండస్ట్రీతో టూరిజం ప్రమోషన్ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. న్యూజిలాండ్, ఉక్రెయిన్ వంటి దేశాలు ఫిల్మ్ టూరిజం వల్ల అభివృద్ధి చెందాయని అన్నారు. ఏపీలో టూరిజం స్పాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది గుర్తించి వాటిని ప్రమోట్ చేయాలని, అప్పుడే ఏపీలో పర్యాటక రంగం డెవలప్ అవుతుందని చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించబోతోన్నామని పవన్ తెలిపారు. వారసత్వ ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు గుర్తించి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ఆలయాల పవిత్రతను కాపాడేలా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పర్యాటక ప్రాంతాల విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలిసేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పర్యాటక రంగ అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆలయాలు, పర్యావరణం, క్రీడా రంగాలు పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణపై దేవాదాయ, పర్యాటక, రోడ్లు, భవనాల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on November 25, 2024 8:30 pm
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…