ఎన్నికల ఫలితాలకు సంబంధించి తెర మీదకు వస్తున్న కొత్త లెక్కలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెర తీస్తున్నాయి. గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ఆయా రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కనిపించని కొత్త ధోరణి కనిపిస్తోంది. ఎన్నికలు జరిగినప్పుడు అధికార.. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి వచ్చే ఓట్లు.. సీట్ల లెక్కలో తేడాలు ఉండొచ్చు. కానీ.. అంతిమంగా అధికార పక్షాన్ని ప్రశ్నించేలా ప్రతిపక్షాన్ని ప్రజలు ఇస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ తీరు మారుతోంది.
పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు రావాల్సిన ఓట్లు.. సీట్లు రాని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు అధికార కూటమి 164 స్థానాల్లో విజయం సాధిస్తే.. విపక్షంగా ఉన్న వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కటం తెలిసిందే.దీంతో.. ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10 శాతం సీట్లు లేకపోవటంతో.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమే లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒక్క ఏపీలోనే కాదు.. తాజాగా ఎన్నికల ఫలితాలు వెల్లడైన మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది.మహారాష్ట్రలో అధికార పక్షంగా మహాయుతి అవతరించగా.. ప్రతిపక్షంగా మహా వికాస్ అఘాడీ నిలిచింది. అయితే.. ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేలా పది శాతం సీట్లు రాలేదు. కూటమిలోని శివసేన (యూబీటీ) 20 సీట్లు.. కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలువచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. పది శాతం సీట్లు అంటే.. 29 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కానీ.. విపక్షంలో నిలిచిన ఏ పార్టీకి ఆ స్థాయిలో సీట్లు రాకపోవటంతో.. మహారాష్ట్రలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందే పార్టీ లేని పరిస్థితి.
ఈ తీరులో దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షం లేకపోవటం గమనార్హం. ప్రధాన ప్రతిపక్షం లేని రాష్ట్రాల జాబితాలో ఏపీ.. అరుణాచల్ ప్రదేశ్.. గుజరాత్.. మణిపూర్.. నాగాలాండ్.. సిక్కింలు ఉన్నాయి. తాజాగా మహారాష్ట్ర కూడా ఈ జాబితాలో చేరింది. ఎన్నికల వేళ.. అధికార పక్షానికి తిరుగులేని మెజార్టీని ఓటర్లు కట్టబెట్టటం మామూలే అయినా.. ప్రతిపక్ష ఉనికిని కూడా చాటుతుంటారు. ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నమైన సీన్ చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశ ఓటర్లకు ఏమైంది? విపక్షం లేని అధికారపక్షాలు కొలువు తీరేలా ఎందుకు చేస్తున్నారు? అన్నది కచ్ఛితంగా ఫోకస్ చేయాల్సిన అంశంగా మారిందని చెప్పకతప్పదు.
This post was last modified on November 25, 2024 9:54 am
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…