ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక విమర్శలు, వ్యాఖ్య లు వినిపించాయి. స్వామి వారికి భక్తులు ఇచ్చిన సొమ్మును దారి మళ్లిస్తున్నారని, ఆ సొమ్ములకు లెక్కలు కూడా చెప్పడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అదేసమయంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేల చొప్పున సేకరించిన సొమ్మును కూడా లెక్కలు లేకుండా చేశారన్న విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కూటమి సర్కారు హయాంలోఇటీవల ఏర్పాటై టీటీడీ బోర్డు..శ్రీవారి నిధులకు సంబంధిం చి సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేసింది. ఇదేసమయంలో ఈ ట్రస్టుకు వచ్చిన నిధులను కూడా స్వామి వారికి సొంత ఖాతాలకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇక, ఈ క్రమంలోనే తాజాగా.. మరో సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. గత వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు స్వామి వారి సొమ్ములను వివిధ ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసింది.
అయితే.. ఎక్కడెక్కడ ఎంత సొమ్ము జమ చేశారన్న వివరాలు లేకపోవడంతో ఇప్పుడు వాటిపై కూడా కూపీ లాగుతున్నారు. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎస్ బీఐ ఖాతా అధికారికంగా ఉంది. దీనికి తోడు మరోబ్యాంకు కూడా ఉంది. ఇవి కాదని వేరే బ్యాంకుల్లో నిధులు జమ చేశారు. ఈ క్రమంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల్లో జమ చేసిన సొమ్మును వెనక్కి తీసుకుని.. వాటిని ఎస్ బీఐ సహా.. తిరుమలకు లింకైన ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే జమ చేయాలని నిర్ణయించారు.
ప్రైవేటు బ్యాంకులలో టిటిడి డిపాజిట్లపై విచారణకు ప్రత్యేక కమిటి వేయనున్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత డిపాజిట్ చేశారన్న వివరాలను సేకరిస్తున్నారు. 2022 నవంబర్ లెక్కల ప్రకారం 19 బ్యాంకుల్లో రూ. 15,938 కోట్లు డిపాజిట్ చేసినట్లు టిటిడి అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రైవేటు బ్యాంకుల నుంచి డిపాజిట్లను వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. తద్వారా.. స్వామి వారి సొమ్మును భద్రంగా ఉంచాలని నిర్ణయించినట్టు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది.
This post was last modified on November 24, 2024 5:58 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…