ఈ సోషల్ మీడియా జమానాలో యూబ్యూటర్లు, ఇన్ స్టా ఇన్ ఫ్లూయన్సర్లు, బ్లాగర్లూ ఎక్కువయ్యారు. ఆయా మాధ్యమాల్లో ఎంత ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉంటే అంత క్రేజ్. ఆ క్రేజ్ వల్ల పాపులర్ అయి బిగ్ బాస్ కంటెస్టెంట్, సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసిన వారు కూడా ఉన్నారు. అయితే, ఆ క్రేజ్ వాడుకొని ఎన్నికల్లో గెలవాలనుకుంటే కుదరదన్న సంగతి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో స్పష్టమైంది. ఇన్‌స్ట్రాగ్రామ్ లో 56 లక్షల మంది ఫాలోవర్లున్న నటుడు అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు వచ్చిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున వెర్సోవా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. యూపీలోని నగీనా ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ‘రావణ్’ ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్ 5.6 మిలియన్స్ (56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్న అజాజ్ ఖాన్ గెలుపుపై నమ్మకం పెట్టుకున్నారు.
అయితే, ఎన్నికల ఫలితాలు అజాజ్ ఖాన్ తో పాటు ఆయన ఫాలోవర్లకూ షాకిచ్చాయి. 56 లక్షల మంది ఫాలోవర్లున్న అజాజ్ ఖాన్ కు కేవలం 146 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన, ఆయన ఫాలోవర్లు ఖంగుతిన్నారు. అంతేకాదు, ఇక్కడ నోటాకు దాదాపు 750 ఓట్లు వచ్చాయి. దీంతో, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు ఓటర్లకు సంబంధం లేదని, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఫాలోవర్స్, క్రేజ్ ఉంటే రాజకీయాల్లో రాణిస్తానుకోవడం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
This post was last modified on November 23, 2024 6:06 pm
అదేంటి అనుకుంటున్నారా? ఏపీని వదిలేసి సీఎం చంద్రబాబు సాహసాలు చేసేందుకు యాత్రలు పెట్టుకున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? అయితే..…
ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 12 రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంత పెద్ద…
కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది. తాజాగా అమెరికాలో కేసులు నమోదయ్యాయని, సౌర…
కీర్తి సురేష్ అంటే ఇంతకుముందు ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర ఉండేది. కెరీర్ ఆరంభం నుంచి ఆమె సంప్రదాయబద్ధమైన పాత్రలే…
సినీ ఇండస్ట్రీ భామలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. హాట్ ఫోటో షూట్స్‌తో ఫ్యాన్స్‌కు…
మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్, జనసేన…