అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల్ని తెర మీదకు తీసుకొస్తారన్న ప్రచారాన్ని సింఫుల్ గా తేల్చేశారు ఏపీ సీఎం. జమిలి ఎన్నికలు వచ్చినప్పటికీ.. రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికలు మాత్రం యథావిధిగా సాగుతాయని చెప్పారు.
దేశంలో జమిలి వచ్చినా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు యథావిధిగా సాగుతాయని.. ముందస్తు ఎన్నికలు అంటూ ఏమీ ఉండవని స్పష్టం చేసిన చంద్రబాబు..విజన్ డాక్యుమెంట్ 2047అమలుపై నిరంతర పర్యవేక్షణ.. సమీక్ష ఉంటుందని స్పష్టం చేశారు చంద్రబాబు. ‘విజన్’ లక్ష్యసాధన కోసం ఆర్థిక వనరుల సమీకరణకు కూడా వినూత్న పథకాలకు తెర తీయనున్నట్లుగా పేర్కొన్నారు.
సెకితో సౌర విద్యుత్ ఒప్పందాల్లో మాజీ సీఎం జగన్.. అదానీ నుంచి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారటూ అంమెరికాలో కేసు నమోదు చేసుకోవటం.. ఆ ఒప్పందం వల్ల రాష్ట ప్రజలపై ఆర్థిక భారాన్ని పడనుండటంతో ఈ ఒప్పందాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. ఒప్పందాల రద్దు అంశానికి వస్తే.. పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోకుండా.. ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్తిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)కి అప్పచెప్పినట్లుగా చంద్రబాబు వెల్లడించారు. మొత్తంగా ఏపీ రూపురేఖల్ని మార్చేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు.మరి.. ఆయన ప్లానింగ్ ఎంతవరకు వర్కువుట్ అవుతుందో చూడాలి.
This post was last modified on November 23, 2024 10:14 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…