పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం ఎంతన్న విషయాన్ని లెక్క కట్టింది కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్). తాజా లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తలసరి అప్పు ఒక్కో తల మీద రూ.1,03,758గా లెక్క కట్టింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2018-19 నాటికి ఏపీలోని ఒక్కో ఆంధ్రోడి తల మీద ఉన్న అప్పు రూ.50,157 కాగా.. నాలుగేళ్ల వ్యవధిలో రెట్టింపు కావటం గమనార్హం.
2019-20లో బడ్జెట్ లో చూపని రుణాల్ని కూడా కలిపితే.. అప్పట్లో ఒక్కో ఆంధ్రోడి మీద ఉన్న రుణభారం రూ.73,525గా ఉండేది. రాబోయే ఏడేళ్ల వ్యవధిలో ఏపీ చెల్లించాల్సిన అప్పు కొండ అక్షరాల రూ.1,39,567.14 కోట్ల అప్పుల్ని తీర్చాల్సి ఉంది. ఈ భారీ రుణాన్ని తీర్చేందుకు వీలుగా.. అదనపు ఆదాయ మార్గాల్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ లేకుంటే డెవలప్ మెంట్ కార్యక్రమాలకు నిధుల్లేని పరిస్థితి నెలకొంటుంది.
గడిచిన ఐదేళ్లలో మూలధన వ్యయం తక్కువగా లెక్క కట్టింది. ఆస్తుల స్రష్టికి 2018-19లో రూ.19,976 కోట్లు వెచ్చిస్తే.. 2022-23లో రూ.7244 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంతేకాదు.. కేంద్రం అమలు చేసే పథకాలకు కేటాయించిన మొత్తాన్ని వినియోగించుకునే విషయంలోనూ గత ప్రభుత్వం ఫెయిల్ అయిన వైనం వెలుగు చూసింది. 2022-23లో కేంద్రం కేటాయించిన రూ.905.69 కోట్లు.. రాష్ట్ర వాటా రూ.835.67 కోట్లు కలిపి మొత్తం రూ.1,741.36 కోట్లు మురిగిపోయినట్లుగా పేర్కొంది. అంతేకాదు.. రాష్ట్ర ప్రాయోజిత పథకాలకు కేటాయించిన రూ.7,346.35 కోట్ల నిధులు మురిగిపోయిన పరిస్థితి.
2022-23లో తీసుకున్న అప్పుల్లో 68.51 శాతం పాత రుణాలు తీర్చేందుకు సరిపోయిందని.. రాష్ట్రం ఎన్ని చెప్పినా అప్పు తీర్చే సామర్థ్యం తక్కువగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 341 రోజులు అప్పుల మీదనే ఆధారపడిన వైనం వెలుగు చూసింది. ఆ ఏడాదిలో రూ.1,18,039 కోట్ల మొత్తాన్ని చేబదుళ్ల రూపంలో తీసుకొని తీర్చేశారు. కాకుంటే.. ఈ మొత్తానికి వడ్డీ రూపంలో చెల్లించిన మొత్తం రూ.148.60 కోట్లు కావటం గమనార్హం.
This post was last modified on November 23, 2024 10:12 am
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…