ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు 20 బిల్లులను ఆమోదించారు. వీటిలో కీలకమైన రెండు బిల్లులను చంద్రబాబు తొక్కిపెట్టారు. అసలు ఈ రెండు బిల్లులనే ఆమోదించాలన్నది టీడీపీ నేతలు, మంత్రులు చెప్పిన మాట. కానీ, చంద్రబాబు మాత్రం ఆ రెండు తప్ప.. అంటూ వ్యాఖ్యా నించారు తర్వాత చూద్దామనికూడా పక్కన పెట్టేశారు. దీంతో తమ్ముళ్లు ఉసూరుమన్నారు.
ఏంటా బిల్లులు..?
1) స్థానిక సంస్థల్లో పాలనను రెండు సంవత్సరాలకు కుదించే బిల్లు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థల పాలనపై పట్టుంటుంది. ఈ విషయంలో సందేహం లేదు. నాలుగేళ్ల అనంతరం.. స్థానిక సంస్థలపై నిర్ణయం తీసుకునే వెలసుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీకి కూడా ఉంటుంది. సదరు సంస్థను రద్దు చేసేందుకు అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టొచ్చు. ఇలానే ఇప్పుడు కూడా తమ్ముళ్లు స్థానిక సంస్థల అధికారాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
ఇదే బిల్లును మంత్రి మండలిలోనూ చర్చించారు. అయితే.. దీనికి చంద్రబాబు అడ్డుకున్నారు. ప్రస్తుతం మరో ఏడాదన్నరే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థలను ఖరాబు చేయొద్దన్నది ఆయ న సారాంశం. దీంతో సదరు బిల్లు బుట్టదాఖలైంది. అయితే.. దీనిని ఆమోదించాలని పలువురు మంత్రు లు కోరినా.. చంద్రబాబు ఒప్పుకోకపోవడం వెనుక.. వ్యూహం ఉంది. స్థానిక సంస్థలను బలవంతంగా తీసు కునే కన్నా.. గెలుచుకునే వ్యూహాలు అమలు చేయాలని ఆయన భావిస్తున్నారు.
2) గ్రామీణ ప్రాంతాల్లో వీధి లైట్లకు సంబంధించి సెస్సు విధించే బిల్లు. దీనిని కూడా చంద్రబాబు అడ్డు కున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వీధిలైట్లను విస్తృతంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సెస్సును విధించాలన్నది మంత్రులు చెబుతున్నమాట. కానీ, ఇలా చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయని.. ఆ బిల్లు అవసరం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. మొత్తంగా తమ్ముళ్లు కీలకమని భావించిన రెండు బిల్లులను చంద్రబాబు రద్దు చేశారు.
This post was last modified on November 22, 2024 11:44 am
ఇప్పటి ట్రెండ్ లో హీరోయిజం అంటే ఎంత హింస ఉంటే అంత కిక్కని భావిస్తున్నారు దర్శకులు. ఎమోషన్, యాక్షన్ కన్నా…
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…