Political News

ఇక‌… తోపుదుర్తి వంతు: టార్గెట్ చేసిన ప‌రిటాల‌.. !

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, రాప్తాడు ఎమ్మెల్యే ప‌రిటాల సునీత‌… రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మ‌ధ్య రాజ‌కీయ విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రింత ఎక్కువ అయ్యాయి. గ‌త ఐదు సంవ‌త్స‌రాల్లో ప‌రిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజ‌కీయాలు చేసిన‌ట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు.

చ‌ర్య‌ల‌కు ప‌ట్టు..
తోపుదుర్తి 2019లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో జాకీ అనే ప‌రిశ్ర‌మ ఏర్పాటును ఆయ‌న అడ్డుకున్నార‌న్న‌ది సునీత అప్ప‌ట్లోనే చేసిన విమ‌ర్శ‌. 129 కోట్ల రూపాయ‌లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల వ‌స్త్రాల‌ను తయారు చేసే పరిశ్రమగా జాకీ పేరు తెచ్చుకుంది. ఇది 2018లో ఏర్పాటైంది. అయితే.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది.

దీనికోసం 2014-19 మ‌ధ్య సునీత క‌ష్ట‌ప‌డ్డార‌నేది వాస్తవం. దీంతో తోపుదుర్తి ఉద్దేశ పూర్వ‌కంగా.. ఈ జాకీని తెలంగాణ‌కు త‌రిమేశార‌న్న‌ది ఆమె ఆవేద‌న.. దీనివెనుక రాజ‌కీయం ఉంద‌ని ఆందోళ‌న‌. ఈ క్ర‌మంలోనే తోపుదుర్తిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ది సునీత చేస్తున్న డిమాండ్‌. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా సునీత కేటాయించేలా చేశారు. అయితే.. ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణ‌.

ఈ నేప‌థ్యంలోనే జాకీ తెలంగాణకు తరలిపోయింది. ఈ క్ర‌మంలో తాము ఆందోళ‌న చేస్తే.. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్న‌ది కూడా సునీత ఆవేద‌న‌. దీంతో ఇప్పుడు తోపుదుర్తిపై చ‌ర్య‌ల‌కు ఆమె ప‌ట్టుబ‌డుతున్నారు. ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌తో పాటు జాకీని తిరిగి తీసుకురావాల‌ని కూడా సునీత కోరుతున్నారు. ఒక‌వైపు స‌భ‌లోనూ.. మ‌రోవైపు ప‌ర్స‌నల్‌గా కూడా.. సునీత ఈ విష‌యంలో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 22, 2024 11:37 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago