విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై శానస మండలి సమావేశాల సందర్భంగా వైసీపీ. కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై గతంలో ఇచ్చిన హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ చెప్పారు. ఈ విషయంపై అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కమిట్మెంట్ తో ఉన్నామని స్పష్టం చేశారు.
ఇంకా చెప్పాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆల్ పార్టీ డెలిగేషన్ పెట్టాలని, ఢిల్లీకి వెళ్లి మాట్లాడదామని వైసీపీ ప్రభుత్వాన్ని తాము అభ్యర్థించామని పవన్ గుర్తు చేశారు.
కానీ, వారు తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఈ రోజు సభ దృష్టికి తీసుకురావాదలుచుకున్నానని పవన్ అన్నారు. ఈ సమయంలో పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మండలిలో వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యన్నారాయణ స్పందించారు.
ఆ రోజు ప్రభుత్వానికి సింగిల్ గానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునే శక్తి ఉందని, కాబట్టే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరం రాలేదని బొత్స అన్నారు. అన్ని పార్టీలను కలుపుకే పరిస్థితి తమకు ఉత్పన్నం కాలేదని చెప్పారు. తమ ప్రభుత్వానికి శక్తి లేనప్పుడే ఆల్ పార్టీ డెలిగేషన్ అవసరమని తెలిపారు.
సింగిల్ గా ఆపగలిగే శక్తి తమకుంది అని బొత్స చేసిన కామెంట్లు విన్న కూటమి సభ్యులంతా కేకలు వేస్తూ నవ్వుకున్నారు. బొత్స కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైజాగ్ స్టీల్..ఎనీ ‘సెంటర్’ సింగిల్ హ్యాండ్ అంటోన్న బొత్స అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ సింహంలా సింగిల్ గా వస్తుందని ఊదరగొట్టి 11 సీట్లకే చతికిలబడ్డారని సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on November 21, 2024 2:18 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…