Political News

జనసేన మహిళా ఎమ్మెల్యేకు అయ్యన్న క్లాస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికారులు తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సభా సమయంలో అధికారులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలన్న నేపథ్యంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని అయ్యన్న ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు దారికి వస్తారని అయ్యన్న వ్యాఖ్యానించారు. ఇటువంటి పద్ధతులను అధికారులు మార్చుకోవాలని అయన వార్నింగ్ ఇచ్చారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై పూర్తి విచారణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని సభలో మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్కడ డిపార్ట్మెంట్ తో పాటు విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుందని అన్నారు. సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక, అక్కడ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.

కాగా, సభలో జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతున్న సమయంలో అయ్యన్న పాత్రుడు కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నను చాలాసేపు చెబుతూ ఉంటే మంత్రులు నోట్ చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, తాను ప్రశ్నను రెండు భాగాలుగా చేశానని, కానీ, ఒక ప్రశ్న మాత్రమే లిస్ట్ అయిందని మాధవి అన్నారు. త్వరగా ఐదు పాయింట్లు చెప్పి ముగిస్తానని అన్నారు. అసెంబ్లీలో రఘురామ, జ్యోతుల నెహ్రూ..అయ్యన్న, కూన రవికుమార్ ల మధ్య కూడా ఇదే తరహాలో డిస్కషన్ జరిగిన సంగతి తెలిసిందే. జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవికి అయ్యన్న క్లాస్ పీకిన వైనం ఈ రోజు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

This post was last modified on November 19, 2024 9:35 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

4 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

7 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

7 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

7 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

7 hours ago