Political News

ట్రంప్ మద్దతుదారుల్లో పెరిగిపోతున్న టెన్షన్

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. వైరస్ ప్రభావం వల్ల 74 ఏళ్ళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు జ్వరం పెరిగిపోవటంతో మిలిటరీ ఆసుపత్రిలో చేరారు. ట్రంప్ ఆరోగ్య పరిస్దితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. నవంబర్ 3వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రెండోసారి గెలిచి స్వేత సౌధంలో కంటిన్యు అవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో ట్రంప్ ను ఓడించి అధ్యక్షునిగా గెలవాలని ప్రత్యర్ధి జో బైడన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది.

మొన్ననే మొదటిసారిగా ప్రత్యర్ధులిద్దరు ముఖాముఖి తలపడ్డారు. అమెరికా గతిని తిరిగరాసే ఎన్నికలుగా భావిస్తున్న కారణంగా వీళ్ళిద్దరి మధ్య పోటి బాగా రసవత్తరంగా తయారైంది. మొన్నటి ముఖాముఖిలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఒకరిపై మరొకరు వ్యక్తిగత విమర్శలకు దిగారు. మామూలుగా అయితే విధానపరమైన చర్చలే జరుగుతాయి. ఆర్ధికం, విదేశీ వ్యవహారాలు, వలసవాదులు, ప్రపంచదేశాలతో అనుసరించబోయే విధానాలు, మిలిటరీ వ్యవహారాల్లాంటి వాటికి చర్చల్లో ప్రాధానత్య ఉంటుంది. కానీ విచిత్రంగా ఇద్దరు పై అంశాలకన్నా వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం గడపేశారు.

సరే ఏదో మొదటి సారి జరిగిన ముఖాముఖి కదా ఈనెల 15వ తేదీన జరగబోయే రెండో ముఖాముఖిలో వారి ప్రాధాన్యతలు మారిపోతాయని అందరు అనుకున్నారు. ఇటువంటి నేపధ్యంలో ట్రంప్ కు కరోనా వైరస్ సోకటంతో రెండో ముఖాముఖి జరగటం అనుమానంగా మారింది. ముఖాముఖి సంగతి దేవుడెరుగు ట్రంప్ అసలు ప్రచారం చేయగలుగుతాడా ? అన్నదే పెద్ద ప్రశ్నగా తయారైంది. ఎందుకంటే ఎన్నికల ముందు జరిగే ప్రచారం ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి సమయంలో సుమారు రెండు వారాలపాటు ట్రంప్ ప్రచారానికి దూరంగా ఉండటమంటే గెలుపుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రంప్ మద్దతుదారుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

తనకు వైరస్ సోకినా కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవటానికి ట్రంప్ ఇష్టపడలేదు. అధ్యక్ష భవనంలో ఉంటునే చికిత్స చేయించుకున్నారు. అయితే హఠాత్తుగా జ్వరం రావటంతో ఆసుపత్రిలో చేరే విషయంలో డాక్టర్లు పట్టుబట్టారు. దాంతో వాషింగ్టన్ శివారు ప్రాంతమైన బెథెస్టాలో ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో ట్రంప్ చేరాల్సొచ్చింది. ఆసుపత్రి నుండే తాను విధులు నిర్వర్తిస్తున్నానని, వీలైనంత తొందరలోనే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ట్రంప్ తాజాగా ఓ సందేశం ఇచ్చారు. అయితే వయస్సు రీత్యా వైరస్ ప్రభావం నుండి ట్రంప్ కోలుకుంటాడా అనే సందేహాలు కూడా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

This post was last modified on October 4, 2020 12:14 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

3 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

11 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

11 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

11 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

13 hours ago