ఏపీలో జాతీయ విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక, ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సీఎం చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, మంత్రులు సన్మానించారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయుల గురించి సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులదని, తల్లిదండ్రులు తర్వాత గురువుకి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పారు.
తనకు విద్య నేర్పిన గురువులు ఇప్పటికీ గుర్తేనని చెప్పారు. మౌలానా అబుల్ కలాం ముందు చూపు వల్లే ఈ రోజు యువత ఐఐటీలో రాణిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఎందరికో ఆదర్శప్రాయమన్నారు. అందుకే, ఈ రెండూ కలిసిన రోజును పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి మోడల్‌గా ఈ సభ పెట్టారని అన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెప్టెంబరు 5న టీచర్స్ డే నాడు జరగాల్సి ఉండగా వరదలు వచ్చాయని చెప్పారు.
మాతృ భాషకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగం కోసం ఇంగ్లీషు నేర్చుకోవాలని చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలో ఒకటి లేదా రెండో స్థానానికి భారత్ చేరుకుంటుందని, ఏ దేశం వెళ్లినా మనవాళ్లు నెంబర్ వన్‌గా ఉంటారని అన్నారు. దేశంలో మోదీ, ఏపీలో తాను అమలు చేసే సంస్కరణల వల్లే ఈ ఫలితాలు వస్తాయని తెలిపారు. కుటుంబ నియంత్రణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించామని చెప్పారు. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గిపోతుండడంతో ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు.
ఐటీ రంగంలో భార్యాభర్తలు ఉద్యోగులు అయితే పిల్లలును కనడంపై దృష్టి పెట్టడం లేదని, ఈ విషయంలో తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. సమాజంలో పిల్లలు కనే విషయంలో పాజిటివ్‌గా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. నిశ్శబ్దం మానండి… పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడండి అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
This post was last modified on November 12, 2024 9:48 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…