ఏపీలో కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు, ఆకాంక్షలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనేక అంశాలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు.. ఉపాధి, ఉద్యోగ కల్పన, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం వంటివి కీలకంగా మారాయి. దీనికితోడు వైసీపీ హయాంలో చేసిన అప్పులు, పారిశ్రామిక వేత్తలకు సరైన సౌకర్యాలు కల్పించకుండా చేసిన వేధింపులు వంటివాటిని దూరం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో అన్నింటికీ ఒక్కటే పరిష్కారంగా కూటమి సర్కారు బడ్జెట్‌ను భావిస్తోంది. ఈ నెల 11న ప్రవేశ పెట్టనున్న వార్షిక(ఐదు మాసాలకు) బడ్జెట్‌లో అనేక సమస్యలకు పరిష్కారం చూపించాలని నిర్ణయించింది. అంటే.. ప్రాజెక్టులు, ఉపాధికల్పన, ఉద్యోగాలు, కొత్త పారిశ్రామిక విధానం, డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ.. వంటి అంశాలను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే, ఇక, ఇప్పుడు వాటికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు సాగనుంది.
దీనిలో భాగంగా.. బడ్జెట్లో కేటాయింపులు చూపించి.. ఆయా పనులను ముందుకు తీసుకువెళ్లే ప్లాన్ చేసింది. వాస్తవానికి ఐదు మాసాలకే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నా.. అభివృద్ధి పనులకు మెజారిటీ బడ్జట్ కేటాయింపులు ఉండాలని భావిస్తోంది. అదేసమయంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వాటికి కూడా నిధులు సంపూర్ణంగా కేటాయించనుందని సమాచారం.
అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన అప్పులు.. వాటికి కడుతున్న వడ్డీలు వంటివాటిని కూడా సంపూర్ణంగా సభలో మరోసారి వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఇక, ప్రధానంగా అమరావతికి.. గతంలో చెప్పినట్టుగానే వార్షిక బడ్జట్‌లోనూ కేటాయింపులు చేయనున్నారు. కేంద్రం సహా బ్యాంకుల నుంచి తీసుకునే సొమ్ములతోపాటు.. రాష్ట్రం కూడా తనవంతు కేటాయించనుంది. ఇక, పోలవరం ప్రాజెక్టుకు కూడా కేటాయింపులు 2 వేల కోట్లకు తగ్గకుండా ఇవ్వనుంది. మొత్తంగా చూస్తే.. తొలి బడ్జట్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదిశగానే అడుగులు వేయనుంది.
This post was last modified on November 9, 2024 12:14 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…