ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో భేటీ అయిన.. కేబినెట్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిని పెంచుతూ.. విజయవాడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను, గుంటూరు, మంగళగిరి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలనుకూడా దీని కిందకు తీసుకువస్తూ.. నిర్ణయించింది. మొత్తంగా మరో 8,352 చదరపు కిలో మీటర్ల మేరకు సీఆర్ డీఏ పరిధిని కేబినెట్ పెంచడం గమనార్హం. దీంతో ఆయా ప్రాంతాలు కూడా రాజధాని పరిధిలోకి వస్తాయి. ఫలితంగా భూముల రేట్లు పెరగడంతోపాటు.. వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలు మరింత విస్తరించనున్నాయని మంత్రి వర్గం అభిప్రాయపడింది.
ఇక, వైసీపీ హయాంలో చెల్లించాల్సిన పలు బిల్లులను పెండింగులో పెట్టిన నేపథ్యంలో వాటిని కూడా చెల్లించేందుకు కేబినెట్ సిద్ధమైంది. 2014-18 మధ్య టీడీపీ హయాంలో రాష్ట్రంలో పచ్చదనం పెంచాలన్న ప్రధాన లక్ష్యంతో ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. దీనిలో కొన్ని బిల్లులు పెండింగులో ఉన్నాయి. వైసీపీ హయాంలో వీటిని చెల్లించాల్సి ఉన్నా.. జగన్.. చెల్లించలేదు. దీంతో ఇప్పుడు ఆ పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (ప్రోహిబిషన్)కు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982 రీఫెల్ బిల్లులకు కూడా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇక, మరో కీలక మైన వ్యవహారంగా ఉన్న ఏపీ జీఎస్టీ-2024 చట్ట సవరణకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల.. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది. అంటే.. కొన్నింటికి రాష్ట్రస్థాయిలో పన్నులు తగ్గించుకోవడంతోపాటు..కొన్నింటికి పెంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. అదేవిధంగా.. ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఎక్సైజ్ చట్ట సరవరణ ద్వారా.. ప్రస్తుతం నూతన మద్యం విధానంలో కల్లు గీత కార్మికులకు షాపులు కేటాయించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తద్వారా.. ప్రైవేటు దుకాణాలతో సమానంగా వారు కూడా షాపులు నిర్వహించుకోవచ్చు. వీటిలో కల్లుతో పాటు.. మద్యాన్ని కూడా విక్రయించే అవకాశం కలగనుంది. ఇక, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యాల సాధనకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తద్వారా.. పిఠాపురాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడనుంది.
This post was last modified on November 6, 2024 9:45 pm
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…
‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమా…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో…
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. కోటీ 15 లక్షల…
ఇవాళ అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్న గేమ్ ఛేంజర్ మీద తెలంగాణ అసెంబ్లీ పెద్ద బాంబు వేసింది. సంధ్య…