Political News

రోడ్డెక్కిన ష‌ర్మిల‌.. ఈసారి రీజ‌న్ ఇదే!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ఫైర్‌బ్రాండ్ ష‌ర్మిల మ‌రోసారి రోడ్డెక్కారు. అయితే.. ఈ ద‌ఫా త‌న‌కు, త‌న కుటుంబానికీ త‌న సోద‌రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని, ఆస్తులు ఇవ్వకుండా ఎగ్గొట్టార‌ని మాత్రం కాదు. కూట‌మి స‌ర్కారు రాష్ట్రంలో పెంచిన విద్యుత్ చార్జీల‌ను కార్న‌ర్ చేసుకుని ఉద్య‌మించేం దుకు ఆమె విజ‌య‌వాడ‌లోని ధ‌ర్నా చౌక్‌లో రోడ్డుపై కూర్చున్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు 17 వేల కోట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీల సర్దుబాటు భారం వైసీపీ చేసిన పాపం అయితే… కూటమి ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు పెడుతున్న శాపం అంటూ వైఎస్ షర్మిల నిన‌దించారు. “కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే హై ఓల్టేజ్ షాక్ ఇచ్చారు. దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపు తున్నారు. ఇప్పటికే 6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో 11 వేల కోట్లు సిద్ధం చేశారు ” అని వ్యాఖ్యానించారు.

ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పై ఎన్నో హామీలు ఇచ్చార‌ని ఆమె గుర్తు చేశారు. వైసిపి 9 సార్లు పెంచిందని గగ్గోలు పెట్టారని, తెలుగు దేశం అధికారంలో ఉంటే ఇది జరిగేది కాదని అన్నార‌ని పేర్కొన్నారు. కూటమి అధికారంలో వచ్చాకా చార్జీలు 30 శాతం తగ్గిస్తామని చెప్పిన విష‌యాన్ని కూడా ఆమె ప్ర‌స్తావించారు. మీకు ఓట్లు వేయడం ప్రజలు చేసిన పాపమా ? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్‌పైనా ష‌ర్మిల విమ‌ర్శ‌లు చేశారు. జగన్ మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 35 వేల కోట్లు భారం మోపార‌ని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్నారు. వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ప్ర‌జ‌ల‌పై భారం మోప‌వ‌ద్ద‌ని ష‌ర్మిల సూచించారు. జ‌గ‌న్ హ‌యాంలో హిందూజా లాంటి కంపెనీకి 12 వందల కోట్లు ఎందుకు ఇచ్చారో తేల్చాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి ప్రజల మీద భారాన్ని మోపవ‌ద్ద‌ని డిమాండ్ చేశారు.

This post was last modified on November 6, 2024 3:09 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago