రాజకీయాల్లో తప్పొప్పులు అనేవి ఉండవు. నేడు తాను చేసింది రైట్ అనిపించిన నాయకుడికి… తదుపరి అదే పనిని తన ప్రత్యర్థి చేస్తే ఏ మాత్రం జీర్ణించుకోలేరు. పైగా నీతి వాక్యాలు, రాజ్యాంగ సూత్రాలు, సామాజిక అంశాలు, అనుబంధాలు, ఆత్మీయతలు వంటి ఎన్నో అంశాలు ప్రవచిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పాలన, బీఆర్ఎస్ కౌంటర్లు చూస్తున్న వారికి సరిగ్గా ఇలాంటి ఫీలింగే కలుగుతోంది. ఒకపార్టీ చేసింది తప్పుపట్టిన పార్టీ తిరిగి అదే చేస్తుండటం… తాము దర్జాగా చేసిన దాన్ని ఇప్పుడు అదే పార్టీ మహాపాపంగా చూస్తుండటం తెలంగాణ రాజకీయాల్లోని పెద్ద కామెడీ!
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోని అనేకానేక అంశాల్లో నిరుద్యోగ ఆవేదన అనేది ప్రముఖంగా పేర్కొనవచ్చు. ఉద్యోగాలు నింపండి మహప్రబో అంటే వారిని పట్టించుకున్నవారే లేరు. ఇదే సమయంలో గత ఏడాది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కేంద్రంగా పేరొందిన అశోక్ నగర్‌లో నిరుద్యోగులను కలిసి వారితో ముచ్చటించారు. ఆయన విద్యార్థులకు టీ తాగించారు. దీంతోపాటుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెలతో ఏడాది పూర్తి కావస్తోంది కూడా! ఇదే సమయంలో కుల గణన సంప్రదింపుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రాష్ట్రానికి విచ్చేస్తుంటే… ఉద్యోగార్థులు ఆసక్తికర డిమాండ్లు పెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగార్థుల వేదిక అయిన అశోక్ నగర్‌కు సమీపంలోని బావర్చీ హోటల్ వద్దకు రాహుల్ గాంధీ రావాలంటూ కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ హోటల్‌కు వచ్చి తమతో బిర్యానీ తినాలని, నిరుద్యోగ సమస్యల గురించి చర్చించాలని అంటున్నారు. అయితే, దీన్ని తెలివిగా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుంది. బిర్యానీ తింటూ ఉద్యోగాల విషయం మాట్లాడుకుందామని బీఆర్ఎస్ నేతలు ఆ హోటల్‌కు వెళ్లారు. బావర్చీ హోటల్‌లో ఓ ఖాళీ కుర్చీని కూడా రాహుల్ గాంధీ కోసం వేసి, దానిపై ఆయన పేరును రాశారు.ఇది సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నపుడు మరోలా చేయడంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రాటుదేలిపోయాయని అంటున్నారు.
This post was last modified on November 5, 2024 7:26 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…