గత ఐదేళ్ల పాలనతో పోల్చుకుంటే.. ఇప్పుడు చాలా మెరుగైన పాలన సాగుతోందని.. ఏపీకి సంబంధించిన వ్యవహారాలను పరిశీలిస్తున్న మేధావులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆహ్వానం, ఆర్ధిక స్థిరత్వం వంటి విషయాల్లో సర్కారు ఆలోచనాత్మక ధోరణితో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా ఏపీ ఆశావహ రహదారిపై ప్రయాణం సాగిస్తున్నట్టు వారు చెబుతున్నారు.
గత 5 ఏళ్లుగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ కి ఆర్థిక స్థిరత్వం తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని వారు అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం విభజన తర్వాత.. మరీ ముఖ్యంగా వైసీపీ పాలనలో అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేస్తున్న అడుగులు ఏపీపై మంచి అభిప్రాయం కలిగిస్తున్నాయని అంటున్నారు. ఇది భవిష్యత్తులో ఏపీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
మరో ముఖ్యమైన విషయం.. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాగలిగిన ప్రాజెక్టులు, పెట్టుబడులు తీసుకొచ్చారు. దీనికి కేంద్రంతో మంచి సంబంధాలు నడిపిన ముఖ్యమంత్రి, టీడీపీ ఢిల్లీ టీమ్.. లావు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఎంపీలు చేసిన కృషిని మేధావులు మెచ్చుకుంటున్నారు. అదేసమయంలో కేంద్రంలోని బిజెపి కూడా ఏపీ విషయంలో సానుకూలంగా ముందుకు సాగుతుండడాన్ని వారు స్వాగతిస్తున్నారు.
ఇక, పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, నారా లోకేష్‌లు చేస్తున్న కృషి కూడా జాతీయ స్థాయిలో చర్చకు వస్తోంది. గత 5 ఏళ్ళుగా ఏపీ నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయి.. ఆ స్థితి నుంచి కేవలం నాలుగున్నర నెలల లోనే పెట్టుబడుల వరద వచ్చేటట్టు చేస్తున్నరు. ఇంటా బయటా తేడా లేకుండా.. పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నాలు ముందుకు సాగుతున్నాయి. మరో నెల, రెండు మాసాల్లోనే ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని తద్వారా ఏపీ దూసుకుపోవడం ఖాయమని మేధావులు తేల్చి చెబుతున్నారు.
This post was last modified on November 4, 2024 11:38 am
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…