ముంబైలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, (ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేత) బాబా సిద్ధికి దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్ధికి సుపారి కిల్లర్ల చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ పని చేసిందని ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు కూడా రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపుతోంది.
10 రోజుల్లో తన పదవికి యోగి రాజీనామా చేయకుంటే సిద్ధికి మాదిరిగానే హత్య చేస్తామని ముంబై పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి బెదిరించాడు. ఆ కాల్ ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. బెదిరింపులకు పాల్పడ్డ ఆగంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధికి హత్యకు గురయ్యే 15 రోజుల ముందు ఈ తరహాలోనే ఆయనకు బెదిరింపు కాల్స్ రావడం తెలిసిందే. సరిగ్గా పదిహేను రోజుల తర్వాత సిద్ధికీని బాంద్రాలో కాల్చి చంపారు.
సిద్ధికీ తనయుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధికి ఆఫీస్ ముందు బాబా సిద్ధికి పై దుండగులు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన సిద్ధికి ఆసుపత్రికి తరలించేలోపే మరణించారు. బాబా సిద్ధికి హత్య, సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ను చంపుతామంటూ వచ్చిన బెదిరింపు కాల్ ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
This post was last modified on November 4, 2024 11:20 am
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…