నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డికి అధికారులు బొకే అందించకపోవడం షాకింగ్ గా మారింది. ఈ సమావేశంలో వేమిరెడ్డితోపాటు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, మహమ్మద్ ఫరూక్, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేసి వేదికపై ఉన్న వేమిరెడ్డిన మరిచారు.
దీంతో, ఆగ్రహానికి గురైన వేమిరెడ్డి వేదిక నుంచి కిందకు దిగి వెళ్లిపోయారు. ఆయన కారు ఎక్కబోతుండగా సంబంధిత అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పారు. వేమిరెడ్డికి సర్ది చెప్పేందుకు ఓ మహిళా అదికారి ప్రయత్నించారు. అయితే, తీవ్ర అసహనానికి లోనైన వేమిరెడ్డి ఆ సారీ మీ దగ్గరే ఉంచుకోండి అంటూ కారు ఎక్కారు. కారులో ఎక్కిన తర్వాత ఆనం రామ నారాయణ రెడ్డి వచ్చి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వేమిరెడ్డి వినలేదు.
తొలిసారి ఇటువంటి సమావేశానికి తాను వచ్చానని, ఇకపై రాబోనని అసహనం వ్యక్తం చేశారు. గౌరవం లేని చోట ఉండనని కారులో అక్కడి నుంచి వేమిరెడ్డి వెళ్లిపోయారు. అందరి తరఫున వేమిరెడ్డిని ఆనం క్షమాపణ కోరనా వేమిరెడ్డి హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారుల తీరుపై మంత్రి ఆనం మండిపడ్డారు. ఇంకోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని కలెక్టర్‌కు ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
This post was last modified on November 4, 2024 11:16 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…