వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బాధ్యత గల ఎంపీ పదవిలో ఉన్న మాధవ్ వీడియో వ్యవహారం లోక్ సభలో కూడా దుమారం రేపింది. అయితే, అధికార పార్టీ లో ఉన్న కారణంతో మాధవ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే అత్యాచార బాధితుల పేర్లను బహిరంగంగా మాధవ్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అత్యాచార బాధితుల పట్ల గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు అమానవీయమని పద్మ మండిపడ్డారు. ఈ ప్రకారం మాధవ్ పై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు పద్మ ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన బాధితుల పేర్లను మాధవ్ నిస్సిగ్గుగా బయటకు వెల్లడించారని, అది దుర్మార్గమని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ సభ్య సమాజం తలదించుకునేలా ఈ రకంగా అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోరంట్ల మాధవ్ వంటి వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని పద్మ డిమాండ్ చేశారు. మాధవ్ పై పోక్సో చట్టం కింద నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. గోరంట్ల వ్యాఖ్యలను సమర్థిస్తూ వైసీపీకి చెందిన మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయని, ఇప్పటికీ వాటిని తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఆ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని ఎద్దేవా చేశారు. గోరంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశానని పద్మ చెప్పారు. మాధవ్ మరి కొద్ది రోజుల్లో అరెస్ట్ కాక తప్పదని వాసిరెడ్డి పద్మ చెప్పారు.
తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని పద్మ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తనకు ఆప్తులని పద్మ చెప్పుకొచ్చారు. వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పద్మ ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on November 2, 2024 4:39 pm
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ (వ్యాపార సంస్కర్త-2025)కు ఆయన ఎంపికయ్యారు.…