రాజకీయాల్లో తనకు తిరుగులేదని భావించే వైసీపీ అధినేత జగన్.. తన సొంత పార్టీలో అంతా తానే అయి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే శాసనం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమడలేక.. జారిపోయారు. ఎన్నికలకు ముందు కూడా.. అనేక మంది నాయకులు జగన్‌ను బ్రతిమాలారు. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. టికెట్లు ఇవ్వాలని కోరారు. అయినా.. ఆయన తన పంథాను వీడలేదు.
దీంతో పదుల సంఖ్యలో నాయకులు అప్పట్లోనే పార్టీకి దూరమయ్యారు. ఇక, పార్టీ పరిస్థితి ఎన్నికల తర్వాత.. ముఖ్యంగా 11 స్థానాలకు పరిమితమయ్యాక.. అనేక మంది నాయకులు జంప్ చేసేశారు. పైగా.. పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట సమయాన్ని స్థితిని కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో తన పంతం కోసం పాకులాడితే.. పార్టీకి అసలుకే ఎసరు వస్తుందని అనుకున్నారో..ఏమో.. జగన్ తగ్గడం ప్రారంభించారు.
అది కూడా .. తన సొంత జిల్లా కడపలోనే జగన్ నాలుగు అడుగులు వెనక్కి వేయడం.. తన మాటను కాదన్న వారిని పక్కన కూర్చోబెట్టుకుని మరీ.. వారి మాటలకు తాను కట్టుబడి నిర్ణయం తీసుకోవడం వంటివి వైసీపీలో చర్చగా మారింది. కడపలోని కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జి వ్యవహారం కొన్నాళ్లుగా రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఈ నియోజకవర్గం బాధ్యతలను తమకంటే తమకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు.
దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిపై తేలిస్తే తప్ప.. తాము పనిచేసేది లేదనివారు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. అయినా.. ఎవరి పంతం వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. నిజానికి జగన్ చెప్పినట్టు గతంలో నాయకులు వినేవారు. కానీ, ఇప్పుడు వారు చెప్పినట్టు జగన్ వినాల్సి వచ్చింది.
దీంతో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్‌చార్జ్ లుగా వ్యవహరించాలని జగన్ చెప్పారు. ఇది ఒకరకంగా తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకుని.. నాయకుల నిర్ణయానికి కట్టుబడి నట్టు అయింది. ఇలా.. గతంలో ఎప్పుడూ లేకపోవడం.. వైసీపీ అధినేత తొలిసారినాలుగు అడుగులు వెనక్కి వేయడం, అది కూడా తన సొంత జిల్లాలోనే ఇలా జరగడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on October 31, 2024 12:11 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…