ఢిల్లీలో ఏదో జరుగుతోంది. అదేమిటో స్పష్టంగా తెలియకపోయినా ఏదో జరుగుతోందనే అనుమానం మాత్రం అందరిలో పెరిగిపోతోంది. ఎందుకంటే వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్రమోడితో భేటి అవబోతున్నారంటూ పార్టిలో ప్రచారం మొదలైంది.
వారం రోజుల క్రితమే కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ రెండు సార్లు సమావేశమైన విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి అమిత్ షా భేటి అవ్వటమే చాలా ఎక్కువ. అలాంటిది వరుసగా రెండు రోజులు రెండుసార్లు సుదీర్ఘ భేటి అంటే వాళ్ళ మధ్య ఏదో కీలక అంశాలే చర్చకు వచ్చుంటాయనేది అర్ధమవుతోంది.
అమిత్ షా-జగన్ రెండు రోజుల భేటిలో ఏమి జరిగిందో ఇంకా బయటకు రాకుండానే మళ్ళీ ప్రధానితో ముఖ్యమంత్రి భేటి అవబోతున్నారనే ప్రచారం మొదలైందంటే విషయం ఏదో సీరియస్ గానే ఉందని అర్ధమైపోతోంది. నిజానికి కేంద్రంలో వ్యవహారాలకు సంబంధించి అమిత్ షాతో మాట్లాడితేనే సరిపోతుంది. హోంమంత్రే ఆ తర్వాత ఆ విషయాన్ని ప్రధాని చెవిలో వేస్తారు. అలాంటిది జగన్ ఇద్దరితోను భేటి అవబోతున్నారంటేనే అందరిలోను సస్పెన్సు పెరిగిపోతోంది.
జగన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న తక్షణ సమస్య న్యాయవ్యవస్ధ నుండే. ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కోర్టులో కేసు వేసేసినా వెంటనే స్టే ఇచ్చేస్తోందనే అభిప్రాయం వైసిపి నేతల్లో ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల్లో అత్యధికం కోర్టుల జోక్యంతోనే ఆగిపోతోందంటూ అధికారపార్టీ నేతలు మండిపోతున్నారు. హైకోర్టులోని చాలామంది జడ్జీలు ఎవరి ప్రయోజనాలను రక్షించటానికే ప్రయత్నిస్తున్నారంటూ స్వయంగా రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు పార్లమెంటు సమావేశాల్లోనే తీవ్రమైన ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది.
ఈ నేపధ్యంలోనే గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కూడా చాలా తీవ్రంగా స్పందించింది. హై కోర్టు మీద నమ్మకం లేకపోతే పార్లమెంటులో చెప్పి మూయించేసేయండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కాకపోతే తామ అధికారాలను వాడాల్సుంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మొత్తం మీద ప్రభుత్వంపై తనకున్న తీవ్ర అసంతృప్తిని హైకోర్టు చాలా ఘాటుగానే బయటపెట్టింది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం-న్యాయవ్యవస్ధల మధ్య పరోక్ష యుద్ధం నడుస్తున్నట్లుగానే భావించాలి.
ఇటువంటి నేపధ్యంలో జగన్ తన భేటిలో అమిత్ షా కు న్యాయవ్యవస్ధలో జరుగుతున్నదంతా వివరించారని సమాచారం. ఈ నేపధ్యంలోనే వచ్చే వారంలో ప్రధానమంత్రిని కలవబోతున్నారంటే విషయం చాలా సీరియస్ అయిపోయిందనే అనిపిస్తోంది. అసలే వైసిపిని ఎన్డీఏలో చేరాల్సిందిగా అమిత్ షా కోరారనే ప్రచారం ఉండనే ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో బిజెపికి నమ్మకమైన మిత్రుడు చాలా అవసరం. మరి ఈ విషయంలో జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే తన డిమాండ్ల పరిష్కారానికి జగన్ పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.
This post was last modified on October 3, 2020 3:34 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…