Political News

హైడ్రా క‌ల‌క‌లం: తిరుప‌తి వెళ్లి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేత‌

అక్ర‌మం, స‌క్ర‌మం అనే సంగ‌తి, చ‌ర్చ అలా ఉంచితే, స‌గ‌టు జీవికి ఇల్లు ఓ క‌ల‌. జీవిత కాల స్వ‌ప్నం. అలాంటి స్వ‌ప్నం విష‌యంలో ఎన్నో మోసాలు. ఇంకెన్నో అక్ర‌మాలు మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌నుషుల‌ను ప‌ల‌క‌రిస్తుంటాయి, క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తాయి, క‌న్నీళ్లు పెట్టిస్తాయి. కానీ… ఈ జాబితాలో ప్ర‌భుత్వ‌మే క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తే… ఆ కుటుంబం ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహకు అంద‌నిది! ఆప‌ద మొక్కుల వాడ‌ని ఏడుకొండల వెంక‌న్న స‌న్నిదికి వెళితే…తిరిగి వ‌చ్చేలోగా ఇళ్లు కూల్చివేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశార‌ని ఆ కుటుంబం వాపోతోంది.

కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌ పరిధిలోని బాలాజీనగర్‌ డివిజన్‌, బాలాజీనగర్‌ కాలనీ హెచ్ఐజీ-53లో కటిక నిరుపమారాణి 268 గజాల స్థలంలో ఇంటిని నిర్మించారు. ఈ నిర్మాణం కోసం 2022లో జీహెచ్ఎంసీ ఆఫీస్‌లో.. స్టిల్‌ప్లస్‌-3కి అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్థులు నిర్మించారు. 8 నెలల క్రితం నిర్మాణం పూర్తయ్యాక ఫ్లాట్స్‌ అన్నీ అద్దెకిచ్చారు. ఐదో అంతస్థులోని 502 ఫ్లాట్‌ను నారాయణ దంపతులకు కిరాయికి ఇవ్వగా.. 501తోపాటు మిగతా ఫ్లాట్స్‌ను కూడా కిరాయికి ఇచ్చారు. 502 ఫ్లాట్‌లో కిరాయికి ఉంటున్న నారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతికి వెళ్లారు. శనివారం ఉదయం అధికారుల పర్యవేక్షణలో డిమాల్యుయేషన్ స్క్వాడ్‌ సిబ్బంది రంగంలోకి దిగి.. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ 502 ఫ్లాట్‌ను కూల్చివేశారు. దీంతో ఇంట్లోని ఏసీ, ఫ్రిడ్జ్‌, సోఫాతోపాటు ఇతర సామగ్రి అంతా ధ్వంసమైంది. 15 మంది సిబ్బంది క్షణాల్లో ఫ్లాట్‌ను కూల్చివేయడం క‌ల‌క‌లం రేపింది.

ఈ కూల్చివేత‌ల తీరును గమనించిన స్థానికులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటిని కూల్చివేసిన అధికారులను ప్రశ్నించారు. నగరంలో ఎక్క‌డా లేని విధంగా ఇక్క‌డే అక్రమ నిర్మాణాలు జరిగాయా? అని ప్రశ్నించారు. ఒకవేళ అక్రమ నిర్మాణమైతే ముందుగా నోటీసులిస్తే బాగుండేదనే అభిప్రాయం అధికారులు, సిబ్బందితో వ్యక్తం చేశారు. దైవ దర్శనం కోసమని ఇంటికి తాళం వేసి ఓ కుటుంబమంతా తిరుపతికి వెళ్తే, అది అక్రమ నిర్మాణమంటూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయ‌డం సంచ‌ల‌నంగానే కాకుండా క‌ల‌క‌లంగా కూడా మారింది.

This post was last modified on October 27, 2024 4:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

13 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago