Political News

కల నెరవేర్చుకునేందుకు రేవంత్ సంచల‌న నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయాల్లో హైడ్రా, మూసి రివర్ ఫ్రంట్ వంటి వాటితో పాటు యంగ్‌ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కూడా ఒకటి అని చెప్పుకోవ‌చ్చు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు నూతనంగా అందుబాటులోకి వస్తున్న అవకాశాలను ప్రవేశం చేసుకునేందుకు యంగ్ ఇండియా స్కేల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అలాంటి స్కిల్ యూనివర్సిటీకి తాజాగా ఒకనాడు తను విమర్శలు గుప్పించిన సంస్థ సహకారం అందిస్తానంటే రేవంత్ రెడ్డి ఓకే చెప్పేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

విద్యార్థులకు నూత‌న అవ‌కాశాల్లో నైపుణ్యాలు నేర్పించేందుకు, అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ శివార్లలో కందుకూరు మండలంలో మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ లోనే యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులుండేలా క్యాంపస్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. త‌మ ఆలోచ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచే సంస్థ‌ల‌కు స్వాగ‌తం చెప్తూ…ఈ మేరకు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇలాంటి జాబితాలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నిక‌గ‌న్న మేఘా సంస్థ‌ చేరింది. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.200 కోట్ల నిధులను ఆ సంస్థ కేటాయించింది.

శనివారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీ క్యాంపస్ లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాకుండా ఈ కీల‌క స‌మావేశంలో త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల‌ను సైతం ఆయ‌న భాగం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు. ఒక‌నాడు గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ సీఎం కేసీఆర్ తో అత్యంత స‌ఖ్య‌త క‌న‌బ‌ర్చిన మేఘా కంపెనీతో త‌న క‌ల‌ల వేదిక అయిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ కోసం ఒప్పందం రేవంత్ రెడ్డి కుదుర్చుకోవ‌డం కీల‌క‌మైన ప‌రిణామ‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

This post was last modified on October 27, 2024 4:33 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

4 minutes ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

41 minutes ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

2 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

3 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

4 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

5 hours ago