తీవ్ర రాజకీయ కలకలం చోటు చేసుకునే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వీకెండ్ వేళ.. నగర శివారులోని ఒక ఫామ్ హౌస్ లో పార్టీ జరగటం.. ఈ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు రంగంలోకి దిగి.. పార్టీని భగ్నం చేయటంతో పాటు.. ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ కు చెందింది కావటం ఇప్పుడు రాజకీయ సంచలనంగా మారింది.
ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు కొన్ని డ్రగ్స్ ను కూడా పోలీసులు సీజ్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ హైప్రొఫైల్ కేసుకు సంబంధించి లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.
పార్టీకి సంబంధించిన మద్యం బాటిళ్ల ఫోటోలతో పాటు.. మరికొన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు రాజకీయంగా రచ్చ నడుస్తున్న వేళ.. కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ ఏర్పాటు చేయటమే పెద్ద తప్పుగా అభిప్రాయపడుతున్నారు. ఈ ఉదంతం రాకీయంగా కూడా గులాబీ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ ఉదంతంపై కేటీఆర ఎలారియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on October 27, 2024 3:58 pm
"ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబును అడ్డుకుంటే చాలు. ఇక, 30 ఏళ్లపాటు మనకు తిరుగు ఉండదు" - అని వైసీపీ…
దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్…
వైసీపీ అధినేత జగన్కు 2024 భారీ షాకేనని చెప్పాలి. పార్టీ ఓటమి, కీలక నాయకుల జంపింగులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు…
మరో సంవత్సరం ముగిసింది. కొత్త ఆశలతో స్వాగతం పలికేందుకు 2025 తయారయ్యింది. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్…
జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించినా.. ఆ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా…