విజయనగరం జిల్లా అధికారపార్టీలో ఇపుడిదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతోంది. జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మధ్య సంబంధాలు ఉప్పు-నిప్పుగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా వీళ్ళద్దరి మధ్య మాటలు కూడా పెద్దగా ఉండటం లేదు. అలాంటి ఈ ఇద్దరు కొద్ది రోజులుగా జిల్లాలో చట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి వీళ్ళద్దరు ఒకపుడు ఆప్తమిత్రులే. కానీ మద్యలో ఏమైందో ఏమో బద్ద శతృవులైపోయారు. అలాంటిది ఇపుడు మళ్ళీ కలుసుకోవటం అంటే ఏదో జరిగిందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినపుడు ముందుగా జిల్లాలో మద్దతు ఇచ్చింది ఇటీవలే మరణించిన పెనుమత్స సాంబశివరాజు. తర్వాత కోలగట్ల చేరటంతో ఆ తర్వాత మరికొందరు నేతలు కాంగ్రెస్ లో నుండి వచ్చి వైసిపిలో చేరారు. అందరికన్నా ఆలస్యంగా వచ్చి పార్టీలో చేరిది బొత్స సత్యనారాయణే అన్న విషయం అందరికీ తెలిసిందే. బొత్స వ్యవహారం ఎలాగుంటుందంటే అదేదో సినిమాలో చెప్పినట్లుగా ’లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా’ అన్నట్లుగానే ఉంటుంది. అందుకనే చివరిలో వచ్చి పార్టీలో చేరినా ముందు మంత్రయిపోయారు.
బొత్స రాకను అడ్డుకునేందుకు కోలగట్ల చాలా ప్రయత్నాలే చేశారట. కానీ ఎందుకనో సాధ్యం కాలేదు. పార్టీలో చేరిన దగ్గర నుండి బొత్సాదే ఫుల్లు డామినేషన్. పార్టీలో చేరటం ఎంఎల్ఏ టికెట్టు దక్కించుకోవటం, గెలవటం మంత్రయిపోవటం వెంటవెంటనే జరిగిపోయాయి. తాను మాత్రమే టికెట్ దక్కించుకోవటం కాదు. తన కుటుంబంలోని వాళ్ళకే దాదాపు ఏడు టికెట్లు దక్కించుకున్నాడట. దీంతోనే అర్ధమైపోతోంది బొత్స వ్యవహారం ఎంత స్పీడుగా ఉంటుందో. ఇదే సమయంలో కోలగట్ల రాజకీయ జీవితం ఎక్కే మెట్టు దిగే మెట్టులాగుంది. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నట్లుగా తయారైంది కోలగట్ల పరిస్ధితి.
ముందు ఎంఎల్ఏగా గెలిచిన కోలగట్ల తర్వాత ఎంఎల్సీ అయ్యారు. ఆ తర్వాత ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎంఎల్ఏగా పోటి చేసి గెలిచారు. అంతే కోలగట్ల సీన్ అక్కడితో ఫ్రీజ్ అయిపోయింది. మంత్రిగా ముందు కోలగట్ల పేరే వినిపించినా చివరి నిముషంలో విజయవాడలో గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్ తన్నుకుపోయారు.
సరే ఇన్ని నేపధ్యాల మధ్యలో అసంతృప్తిగా ఉన్న కోలగట్లతో పాటు బొత్సను జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడారట. కోలగట్ల గెలిచిన విజయనగరం నియోజకవర్గంలో బొత్స జోక్యం వద్దని జగన్ గట్టిగా చెప్పారట. అలాగే కోలగట్లలోని అసంతృప్తి మొత్తాన్ని తొలగించే బాధ్యతను సిఎం బొత్స మీదే ఉంచారట. దాంతో ఇద్దరికీ చేతులు కలపక తప్పలేదు. ఎటూ చేతులు కలిపారు కాబట్టి మళ్ళీ ఇద్దరు బాగా సన్నిహితం అయిపోయినట్లు పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. విడిపోయిన ఇద్దరు మిత్రులు మళ్ళీ కలిసారంటే మంచిదే కదా.
This post was last modified on October 2, 2020 11:23 am
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…